Shattila Ekadashi 2027 | షట్టిల ఏకాదశి తేదీ, వ్రతం, ప్రాముఖ్యత, పూజా ఆచారాలు, మంత్రం

0
1804
Shattila Ekadashi Date, Puja Vidhi, Significance, Vrat, Fasting Rules
What are the Shattila Ekadashi Date, Puja Vidhi, Significance, Vrat, and Fasting Rules?

Shattila Ekadashi 2027

1షట్టిల ఏకాదశి 2027

షట్టిల ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తి యొక్క బైకుంఠ రూపాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ షట్టిల ఏకాదశి మాఘ కృష్ణ ఏకాదశి, తిల్ద ఏకాదశి మరియు సత్తిల ఏకాదశి అని రకరకాల పెర్లతో కూడా పిలుస్తారు. ఈ రోజు నువ్వులకు పెద్ద ప్రాముఖ్యత ఉంది. వాటిని 6 రకాలుగా ఉపయోగిస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వలన కోరికలన్నీ నెరవేరి, పాపాలు నశించి మరియు అతను దుఃఖం, పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి యొక్క తిథి, శుభ ముహూర్తాలు మరియు పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

షట్టిల ఏకాదశి 2027 తేదీ మరియు శుభ సమయం (Shattila Ekadashi 2027 Date & Muhurtam) :

2027 సంవత్సరంలో షట్తిల ఏకాదశి ఫిబ్రవరి 2, మంగళవారం నాడు వస్తుంది.

ముఖ్యమైన వివరాలు:

ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 1, 2027న రాత్రి 10:20 గంటలకు (దాదాపు).
ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 2, 2027న రాత్రి 11:29 గంటలకు (దాదాపు).
పారణ సమయం (ఉపవాస విరమణ): ఫిబ్రవరి 3, 2027న ఉదయం 07:08 నుండి 09:19 గంటల మధ్య.

షట్టిల ఏకాదశి పూజా విధానం (Shattila Ekadashi Puja Vidhi) :

1. వేకువజామున నిద్ర లేచి నువ్వులు కలిపి నీటితో స్నానం ఆచరించాలి.
2. శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఉపవాసం ప్రతిఘ్న చేయాలి.
3. విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని గంగాజలంలో నువ్వులను కలిపి చిత్రపటంపై చల్లాలి.
4. తరువాత విష్ణుమూర్తి ధూప దీపాలు వెలిగించి ఏర్పాటు చేయాలి.
5. ఈ రోజు విష్ణుమూర్తికి నువ్వులు సమర్పించాలి.అలాగే విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి వివిధ నైవేద్యం సమర్పిస్తారు.
6. ఈ రోజు నువ్వులను దానం చేయండి.
7. పవిత్రమైన అగ్ని ముందు విష్ణుమూర్తికి విష్ణు సహస్రం జపిస్తూ ప్రార్థనలు చేయండి.
8. ఆ తర్వాత రోజు పొద్దున్నే నిద్రలేచి, స్నానం ఆచరించి, విష్ణువుకి భోజనం పెట్టాలి.
9. తరువాత ఉపవాసం విరమించే ఆహారం తీసుకోండి.

షట్టిల ఏకాదశి ప్రాముఖ్యత (Shattila Ekadashi Significance) :

1. షట్టిల ఏకాదశి గొప్పదనం భవిష్యోత్తర పురాణంలోని పులస్త్య ముని, దాల్భ్య మహర్షి వీరి ఇద్దరి మద్య జరిగిన సంభాషణగా వివరించబడింది.
2. ఈ ఏకాదశిని పాటించే వారికి అనంతమైన సంపద, ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం.
3. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని చేసిన వారికి విష్ణుమూర్తి యొక్క మోక్షాన్ని దక్కుతుంది.
4. ఈ రోజు నువ్వులు దానం చేయడం వలన భక్తులు వారి ఈ జన్మలో లేదా గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారు.
5. నువ్వులను నీటిలో కలిపి సమర్పించడం వలన చనిపోయిన పూర్వీకులు కూడా సాంత్వన చేకూరుతుంది.

నువ్వుల ప్రాముఖ్యత (Significance Of Sesame Seeds On Shattila Ekadashi):

ఈ ఏకాదశి రోజు నువ్వులు 6 రకాలుగా ఉపయోగిస్తారు:

1. నువ్వులను నీటిలో నానబెట్టి, ఆ నీటితో స్నానం చేయడం.
2. నువ్వులను చర్మ సౌందర్య సాధనాలుగా ఉపయోగించడం.
3. వాటిని పవిత్ర హవనం లేదా అగ్ని కార్యక్రమంలో వాడడం.
4. నువ్వులు నానబెట్టి ఆ నీటిని తాగడం.
5. దానంగా నువ్వులను ఇవ్వడం.
6. స్వీట్ మరియు వంటకాలలో ఉపయోగించడం.

Related Stories

Kala Sarpa Dosham | కాలసర్ప దోషం అంటే ఏమిటి? కాలసర్ప దోషం యొక్క రకాలు దాని ప్రభావాలు మరియు నివారణలు.

Amalaki Ekadashi 2027 | అమలకి ఏకాదశి 2027 తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం

విజయ ఏకాదశి 2027 తేదీ, వ్రతం, పూజ విధానం, ప్రాముఖ్యత | Vijaya Ekadashi 2027

Complete List of Ekadashi 2026 | ఏకాదశి 2026 తేదీల జాబితా, ఏ ఏకాదశి ఎప్పుడు?

2024 Hindu Festivals & Important Days Calendar | హిందూ పండుగల క్యాలెండర్

Ekadashi Story | ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ఒక దేవత అని తెలుసా? ప్రాముఖ్యత, విశిష్ఠత, పూజ విధానం, ఉపవాస నియమాలు ఏమిటి?

Pausha Putrada Ekadashi 2027 | పౌష పుత్రద ఏకాదశి ఆచారాలు, పూజ విధానం & ప్రాముఖ్యత

Hindu Festivals in January 2024 | జనవరిలో హిందువుల ముఖ్యమైన పండుగలు | Hindu Important Days Calendar

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య