విజయ ఏకాదశి 2027 తేదీ, వ్రతం, పూజ విధానం, ప్రాముఖ్యత | Vijaya Ekadashi 2027

0
846
Vijaya Ekadashi Date, Fasting, Vrat, Puja Vidhi, Significance
What are the Vijaya Ekadashi Date, Fasting, Vrat, Puja Vidhi, Significance, Story and Chanting Stotras?

Vijaya Ekadashi History

1విజయం కావాలన్నా, కష్టాలు తీరాలన్నా… విజయ ఏకాదశి!

మన హిందూ మతంలో విజయ ఏకాదశికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. విజయ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధించే వరం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాసం పాటించడం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. మరణం తరువాత కూడా మోక్షం లభిస్తుందని కూడా చెబుతున్నారు. మరి ఏకాదశి యొక్క శుభ సమయం, పూజా విధానం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

విజయ ఏకాదశి తేదీ మరియు తిధి సమయాలు (Vijaya Ekadashi 2027 Date, Muhurtam Timing) :

విజయ ఏకాదశి, బుధవారం, 03 మార్చి 2027

ఏకాదశి తిథి ప్రారంభం: 03 మార్చి 2027 ఉదయం 03:14 గంటలకు.
ఏకాదశి తిథి ముగుస్తుంది: 04 మార్చి 2027 ఉదయం 05:44 ని.

విజయ ఏకాదశి వ్రతం, పూజ ఆచారాలు (Vijaya Ekadashi Vrat & Puja Vidhi) :

1. వేకువజామున లేచి బ్రహ్మ ముహూర్తం సమయంలో స్నానం ఆచారించండి.
2. ఆ తర్వాత ఉపవాస తీర్మానాన్ని తీసుకోండి.
3. ఇంట్లో పూజ మందిరంలో విష్ణువు విగ్రహాన్ని ఉంచండి.
4. నువ్వుల నూనె, ఆవు నెయ్యి తో దీపాన్ని వెలిగించండి.
5. ధూపం, పండ్లు మరియు నైవేద్యం విష్ణువుకు సమర్పించండి.
6. విష్ణు సహస్రనామం, విజయ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయండి.
7. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని జపిస్తూ విష్ణుమూర్తికి ఆవాహన చేయండి.
8. భక్తి, శ్రద్ధలతో విష్ణుమూర్తికి పూజించండి.
9. స్వామి వారికి హారతి ఇచ్చి పూజను ముగించాలి.
10. ఆ తర్వాత రోజు విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించిన తరువాత మీ ఉపవాసాన్ని విరమించండి.

విజయ ఏకాదశి ప్రాముఖ్యత (Vijaya Ekadashi Significance) :

1. విజయ ఏకాదశి ఆచరించేవారు తమ యొక్క ప్రత్యర్థులపై ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు.
2. ఈ వ్రతం ప్రభావం వలన పూర్వం రాజులు, చక్రవర్తులు చాలా యుద్ధంలో విజయం సాధించారు.
3. విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే శత్రువులు చుట్టుముట్టిన విపత్కర పరిస్థితుల్లో కూడా విజయం చేకూరుతుందని నమ్మకం.
4. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.
5. ఈ వ్రతం చేయడం వలన నరకం విముక్తి కలిగి స్వర్గానికి వెళ్తారని చెబుతారు.
6. గత జన్మలో చేసిన పాపాలు తొలుగుతాయని నమ్మకం.

విజయ ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు / స్తోత్రాలు (Chanting Stotras or Mantras on Vijaya Ekadashi) :

విష్ణుమూర్తికి పూజ సమయంలో ఈ క్రింది మంత్రాలు పఠించండి.

1. “ఓమ్ నారాయణాయ లక్ష్మీ నమ” అనృ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
2. “ఓమ్ సియా పతియే రామ్ రామాయ నమ” అనే మంత్రాన్ని జపించడం ద్వార మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి.
3. “ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమ” మంత్రాన్ని పఠించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు విరజిల్లుతుంది.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Stories

Shattila Ekadashi 2025 | షట్టిల ఏకాదశి తేదీ, వ్రతం, ప్రాముఖ్యత, పూజా ఆచారాలు, మంత్రం

Complete List of Ekadashi 2026 | ఏకాదశి 2026 తేదీల జాబితా, ఏ ఏకాదశి ఎప్పుడు?

2024 Hindu Festivals & Important Days Calendar | హిందూ పండుగల క్యాలెండర్

Ekadashi Story | ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ఒక దేవత అని తెలుసా? ప్రాముఖ్యత, విశిష్ఠత, పూజ విధానం, ఉపవాస నియమాలు ఏమిటి?

Pausha Putrada Ekadashi 2027 | పౌష పుత్రద ఏకాదశి ఆచారాలు, పూజ విధానం & ప్రాముఖ్యత

Hindu Festivals in January 2024 | జనవరిలో హిందువుల ముఖ్యమైన పండుగలు | Hindu Important Days Calendar

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules