
2027 Amalaki Ekadashi Vrat
1అమలకి ఏకాదశి వ్రతం 2027
హిందూ మతంలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ మాసంలో వచ్చే హోలీ పండుగ ముందు అమలకి ఏకాదశి వస్తుంది. ఈ రోజున భక్తులు ఉసిరి చెట్టు కి విశేషమైన పూజలు చేస్తారు. ఈ రోజున విష్ణు మూర్తి ఉసిరి చెట్టులో కొలువుతీరుతాడని మన పురాణాలు చెపుతున్నాయి. విష్ణు మూర్తితో పాటు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని భక్తుల నమ్మకం. రాధా కృష్ణులు కూడా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద సంతోషంగా గడుపుతూ ఉంటారని మన వేద పురాణ గాథలు చెపుతున్నాయి. మరి ఈ ఏకాదశి తిథి, తేదీ, పూజ విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
అమలకి ఏకాదశి తేదీ & తిథి సమయాలు (Amalaki Ekadashi 2027 Date & Thithi Muhurt):
2027లో అమలకి ఏకాదశి గురువారం, 18 మార్చి 2027న జరుపుకుంటారు.
ముఖ్యమైన సమయాలు (మార్చి 18, 2027):
ఏకాదశి తిథి ప్రారంభం: 17 మార్చి 2027, రాత్రి 10:52 గంటలకు.
ఏకాదశి తిథి ముగింపు: 18 మార్చి 2027, రాత్రి 8:22 గంటలకు.
అమలకి ఏకాదశి పూజ విధానం (Amalaki Ekadashi Rituals & Puja Vidhi):
1. ఈ ఏకాదశి రోజున, వేకువజామున నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి.
2. ఉపవాసం దీక్ష చేస్తా అని శ్రీమహావిష్ణువును స్మరించుకోవాలి.
3. పూజ గదిలో దీపం వెలిగించి, విష్ణుమూర్తి కి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి.
4. పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి.
5. ఇంట్లో పూజ తర్వాత ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలశం ప్రతిష్టించడం.
6. ఉసిరి చెట్టుకు దీపం, ధూపం, పువ్వులు, బియ్యం మొదలైన వాటిని సమర్పించి పూజ చేయాలి.
7. ఈ రోజున పూజ సమయంలో విష్ణు మూర్తితో పాటు లక్ష్మీదేవి, కుబేరుడు కూడా స్మరించుకోండి.
8. ఈరోజు పేదలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం పెట్టి, ఆ రోజు అంత మిరు దైవ ధ్యానంలో ఉండాలి.
9. ఒకవేళ ఉసిరి చెట్టు అందుబాటులో లేకపోతే మీరు ఉసిరికాయను విష్ణువుకు ప్రసాదంగా సమర్పించవచ్చు.
10. మరుసటి రోజు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించి, నైవేద్యం సమర్పించాలి.
11. ఆ తర్వాత ఆహారం తీసుకుని ఉపవాసం విరమించండి.
అమలకి ఏకాదశి ప్రాముఖ్యత (Amalaki Ekadashi Significance):
1. మలకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ద్వారా తీర్థయాత్రలను సందర్శించడం లేదా యజ్ఞం చేయడంతో సమానంగా మోక్షాన్ని పొందుతారు భక్తులు.
2. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయలేనివారు ఒక ఉసిరికాయను విష్ణువుకి నైవేద్యంగా సమర్పించిన దాని మీరు తినవచ్చు.
3. ఈ రోజు ఉసిరికాయ తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని గ్రంధాలు చెబుతున్నాయి.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Related Stories
Shattila Ekadashi 2025 | షట్టిల ఏకాదశి తేదీ, వ్రతం, ప్రాముఖ్యత, పూజా ఆచారాలు, మంత్రం
విజయ ఏకాదశి 2025 తేదీ, వ్రతం, పూజ విధానం, ప్రాముఖ్యత | Vijaya Ekadashi 2025
Complete List of Ekadashi 2026 | ఏకాదశి 2026 తేదీల జాబితా, ఏ ఏకాదశి ఎప్పుడు?
2024 Hindu Festivals & Important Days Calendar | హిందూ పండుగల క్యాలెండర్
Pausha Putrada Ekadashi 2027 | పౌష పుత్రద ఏకాదశి ఆచారాలు, పూజ విధానం & ప్రాముఖ్యత
Hindu Festivals in January 2024 | జనవరిలో హిందువుల ముఖ్యమైన పండుగలు | Hindu Important Days Calendar
Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య







