
Kurma Dwadashi 2027
1కూర్మ ద్వాదశి
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
కూర్మ ద్వాదశి ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైన ద్వాదశి. కూర్మ అనే పదం సంస్కృత నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం తాబేలు. ఈ రోజున మహావిష్ణువు సముద్ర మథనం కోసం తాబేలుల అవతరించాడని నమ్ముతారు. విశ్వం సంరక్షకుడు విష్ణువు చెడు నుండి మంచిని రక్షించడానికి వివిధ రూపాల్లో అవతరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు ముఖ్యమైన అవతారాలలో రెండవది ఈ కూర్మ అవతారం. ఏకాదశి రోజున ఎలాగైతే విష్ణువు ఆరాదిస్తామో ఈ ద్వాదశి వ్రతం కూడా విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ కూర్మ ద్వాదశి రోజున ఉపవాసం పాటించడం వలన పాపాల నుంచి విముక్తి కలిగి మోక్షాన్ని పొందుతారు నమ్మకం. అయితే మనం ఇప్పుడు కూర్మ ద్వాదశి పూజా విధి, వ్రత కథ, తేదీ, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
కూర్మ ద్వాదశి వ్రతం తేదీ, తిధి 2027 (Kurma Dwadashi 2027 Date & Muhurtam):
2027లో కృష్ణ కూర్మ ద్వాదశి ఫిబ్రవరి 2, మంగళవారం నాడు వస్తుంది.
ముఖ్యమైన సమయాలు:
ద్వాదశి తేదీ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2027 ఉదయం 07:11.
ద్వాదశి తేదీ ముగింపు: ఫిబ్రవరి 2, 2027 ఉదయం 07:19.
పారణ సమయం (ఉపవాసం విరమించే సమయం): ఫిబ్రవరి 3, 2027 ఉదయం 07:10 నుండి 09:18 వరకు.
కూర్మ ద్వాదశి కథ (Kurma Dwadashi Story) :
దేవేంద్రుని ప్రవర్తన నచ్చిన దూర్వాస మహర్షి కోపగించుకొని దేవతలు అందరు శక్తిహీనులగుదురు అని శపించాడు. దానికి చింతించిన దేవతలందరూ స్వర్గలోక ప్రాప్తి కోసం శ్రీమహావిష్ణువుకు మోర పెట్టుకున్నారు. ఆప్పుడు మహావిష్ణువు సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని వారికి చెప్పారు. అప్పుడు దేవతలు అందరూ ఆ కార్యం కోసం దానవులతో సంధి పెట్టుకుంటారు. అప్పుడు ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా మరియు దైవ సర్పమైన వాసుకి త్రాడుగా అమర్చి క్షీర సముద్ర మథనం మొదలు పెట్టారు. ఆ సమయంలో మందరగిరి బరువుకి మునిగి పోసాగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు ఆ కార్యం ఆగిపోకూడదని కూర్మావతారాన్ని ధరించి ఆ పర్వతాన్ని భరించెను. అప్పుడు శ్రీమహావిష్ణువు అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. సముద్రం అమృతం మరియు విషం కూడా విడుదల చేసింది. దీని మీద దేవతలు, అసురులు యుద్ధం ప్రారంభించారు. అప్పుడు శివుడు విషాన్ని త్రాగి తన గొంతులో ఉంచుకున్నాడు. అసురులు మాత్రం అమృతంతో పారిపోతుండగా శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించి ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశారు. కూర్మ ద్వాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని కూర్మ రూపంలో పూజించడం వలన కోరికలన్నీ తీరి, మోక్షం ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.
కూర్మ ద్వాదశి వ్రతం ఎలా పాటించాలి? (Kurma Dwadashi Vrat Rules)
1. కూర్మ ద్వాదశి తాబేలు అవతారంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది.
2. ద్వాదశి రోజు వేకువజామున చేసి పుణ్య స్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
3. ఒక పీటపై విష్ణువు విగ్రహం కూర్మ స్ఫటిక విగ్రహాన్ని పెట్టాలి.
4. ఆ పీటను పూలతో, అలంకరించాలి.
5. విష్ణుమూర్తికి పుష్పాలు, పండ్లు మరియు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి.
6. విష్ణుమూర్తికి యొక్క శ్లోకాలు జపిస్తూ ఆయన అనుగ్రహాన్ని కోరుకొండి.
7. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
8.దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకుని, విష్ణుమూర్తి ఆరాధన చేయండి.
9.ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వలన పాప విముక్తికి లభిస్తుంది.
10. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని కూర్మ ఆరాధించడం వలన కోరికలన్నీ తీరి, మోక్ష కలుగుతుందని భక్తుల విశ్వాసం.
కూర్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత (Kurma Dwadashi Significance):
1.హిందూవులకు కూర్మ ద్వాదశి రోజు చాల ప్రాముక్యత కలిగి ఉంది.
2.ఈ రోజు నూతన నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి పవిత్రమైనదిగా భావిస్తారు.
3.ఈ రోజు సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు.
4.ఈ రోజున ఉపవాసం మరియు దానధర్మాలు చేసే వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.
5.దేవునికి వస్త్రాలు, ధనాన్ని నైవేద్యంగా సమర్పించిన వారికి అదృష్టం వరిస్తుంది.
6.ఈ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన మంచి జరుగుతుంది.
7.కూర్మ ద్వాదశి వ్రతాన్ని ఆచరించి భక్తులు వారి పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
శ్రీ కూర్మ స్తోత్రం, Sri Kurma Stotram | Sri Koormavatara Stothram
Kurma Dwadashi | Significance & Traditions of Kurma Dwadashi







