ఈరోజు – శని త్రయోదశి. ఆ రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Shani Trayodashi Importance in Telugu

1
26584
Shani-Trayodashi-Hariome
Shani Trayodashi Importance in Telugu

Shani Trayodashi Importance in Telugu

Next

2. శని త్రయోదశి ఎలా జరుపుకోవాలి?

వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా “అష్టమ” , “అర్ధాష్టమ” , ” ఏలినాటి శని ” లతో బాధ పడుతున్నవారు.రేపు ఉదయం “శన్యూష కాలంలో” అనగా తెల్లవారుజామున 5.00 నుండి 6:30 మధ్యకాలంలో లేదు ” శని హోరలో” అనగా ఉదయం 6:30 నుండి 7:30 మద్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు. సాయంత్రం “ప్రదోష వేళలో ” అనగా 5:30 to 6:30 మధ్య కాలంలో శివాలయం లో “నువ్వల నూనె” తో దీపారాధన చేసిన ఉన్నతమైన ఫలితాలు పొందుతారు.

  • సూర్యోదయానికి ముందే స్నానాదికాలను ముగించుకుని శనైశ్చరుడిని ఆరాధించాలి.
  • నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం| -అనే శని ధ్యాన శ్లోకాన్ని పఠించాలి.

  • ఈరోజున ఉపవాసం ఉండడం మంచిది.
  • శని శాంతి పూజలు ఈ శనిత్రయోదశినాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి.
  • శనికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
  • నల్లని వస్త్రాలను ధరించడం దానం చేయడం రెండూ మంచిదే.
  • కొన్ని నల్లనువ్వులు, కొద్దిగా నువ్వులనూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఏడంగుళాల నల్లని రిబ్బను, ఎనిమిది ఇనుప చీలలు/మేకులు(nails), కొన్ని నవధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. లేదా పారే నదిలో విడిచిపెట్టాలి.
  • కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చెయ్యాలి.
  • శని త్రయోదశినాడు నూనె గానీ, గొడుగు కానీ, నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాద.
Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here