
Shani Trayodashi Significance in Telugu
1శని త్రయోదశిని ఎప్పుడు జరుపుకుంటారు? When Shani Trayodashi Celebrate?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని … తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై వుంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో వుంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి.
ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది (Shani Trayodashi Slokam)
‘‘ నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్’’
పాటించవలసిన ముఖ్య నియమములు (Important Rules to Follow on Shani Trayodashi)
- ఈరోజున ఉపవాసం ఉండడం మంచిది.
- శని శాంతి పూజలు ఈ శనిత్రయోదశినాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి.
- శనికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
- నల్లని వస్త్రాలను ధరించడం దానం చేయడం రెండూ మంచిదే.
- కొన్ని నల్లనువ్వులు, కొద్దిగా నువ్వులనూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఏడంగుళాల నల్లని రిబ్బను, ఎనిమిది ఇనుప చీలలు/మేకులు(nails), కొన్ని నవధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. లేదా పారే నదిలో విడిచిపెట్టాలి.
- కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చెయ్యాలి.
- శని త్రయోదశినాడు నూనె గానీ, గొడుగు కానీ, నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాదు.
శని త్రయోదశి 2026 తేదీలు (Shani Trayodashi 2026 Dates):
- జనవరి 31
- జూన్ 13
- జూన్ 27
- అక్టోబర్ 24
- నవంబర్ 7







