
How to Celebrate Sri Rama Navami in Telugu
1శ్రీ రామ నవమి పూజ (Sri Rama Navami Puja)
రామ నవమి పండుగను పెద్దవాళ్ళు ఎంతో ఘనంగా చేసుకునే వారు. ఈ తరానికి పట్టణ వాతావరణానికీ తాటాకు పందిళ్లూ, వాడ వాడంతా పంచుకునే వడప్పప్పు పానకాలూ, దంపతి తాంబూలాలూ, విసన కర్రల దానాలూ వీటన్నిటి గురించి చెప్పే పెద్దవారు అందరి ఇళ్లలోనూ ఉండక పోవచ్చు.
మన రామనవమి పండుగ సంప్రదాయ పద్ధతిలో ఎలా జరుపుకోవాలో చెప్పే చిన్న ప్రయత్నం ఇది. శ్రీ రామ నవమి జరుపుకోవాలంటే మరి ఆ పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలియాలి కదా! రామ నవమి రాముని పుట్టిన రోజని కొందరూ, కాదు ఆయన పెళ్లి రోజని మరి కొందరూ, కాదు పట్టాభిషేకమని ఇంకొందరూ అంటారు. నిజానికి రామనవమి ఏ సందర్భం లో జరుపుకుంటాం?
రామ నవమి శ్రీరాముని పుట్టినరోజా లేక పెళ్లిరోజా? (Rama Navami Day is Ram’s Coronation, Birthday or Marriage Day?)
చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశి లో జన్మించాడు. శ్రీ రాముని జననం లోకకళ్యాణ కారకము కనుక ఆరోజునే ఆయన జన్మదినాన్ని, వివాహ మహోత్సవాన్ని, పట్టాభిషేకాన్ని మనము జరుపుతాము.
శ్రీరామనవమి పూజ ఎలా చేయాలి? (How to Perform Sri Ram Navami Puja?)
సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రంచేసుకోవాలి. రంగవల్లులతో అలంకరించుకోవాలి.మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి.
అభ్యంగన స్నానం ఆచరించాలి. కొత్తబట్టలను ధరించాలి.రామచంద్రుని పటాలను లేదా విగ్రహాలను శుభ్రపరచి అలంకరించాలి. పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి.
బియ్యప్పిండి తో ముగ్గు వేయాలి. పీట మీద పట్టువస్త్రాన్ని గాని నూతన వస్త్రాన్ని గాని వేయాలి. ఆ వస్త్రం పైన సీతారాముల పటాలను లేక విగ్రహాలను ఉంచి షోడశోపచార విధి లో పూజించాలి.
వడపప్పు, పానకాలని నైవేద్యంగా పెట్టాలి. పూజ ముగించిన తరువాత దంపతులకు పండును, విసనకర్రను, తాంబూలమును, యథాశక్తిగా వస్త్రాలను ఇవ్వలి.
ప్రసాదాన్ని బంధు,మిత్రులతో కలసి తీసుకోవాలి. రామకథను మనసారా స్మరించుకొండి.
Sri Rama Navami 2027 Date & Tithi
2027లో శ్రీరామ నవమి ఏప్రిల్ 15, 2027 (గురువారం) నాడు జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించిన రోజును పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు.
ముఖ్యమైన వివరాలు:
తేదీ: 15 ఏప్రిల్ 2027 (గురువారం)
నవమి తిథి ప్రారంభం: 14 ఏప్రిల్ 2027 – 03:23 PMనవమి
తిథి ముగింపు: 15 ఏప్రిల్ 2027 – 03:00 PM (సుమారు)
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Sri Rama Navami Puja Method / Vidh | శ్రీ రామ నవమి పూజ విధానం
Vadapappu & Panakam on Rama Navami | శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు?
Sri Rama Navami, the Birthday of a Perfect Man | Sri Rama Navami History
శ్రీ రామ అష్టోత్తరనామావళిః – Sri Rama Ashtottara Satanamavali
శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం – Sri Rama ashtottara satanama stotram
Sri Rama Apaduddharana Stotram | శ్రీ రామ ఆపదుద్ధారణ స్తోత్రం
Sri Rama Dwadasa Nama Stotram – శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం
Sri Rama Bhujanga Prayata Stotram | శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం







