How to Celebrate Sri Rama Navami | ఇంట్లో శ్రీరామ నవమిని ఎలా జరుపుకోవాలి?

0
17887
Sri Rama Navami
What to Do on Sri Rama Navami & How to Celebrate?

How to Celebrate Sri Rama Navami in Telugu

1శ్రీ రామ నవమి పూజ (Sri Rama Navami Puja)

రామ నవమి పండుగను పెద్దవాళ్ళు ఎంతో ఘనంగా చేసుకునే వారు. ఈ తరానికి పట్టణ వాతావరణానికీ తాటాకు పందిళ్లూ, వాడ వాడంతా పంచుకునే వడప్పప్పు పానకాలూ, దంపతి తాంబూలాలూ, విసన కర్రల దానాలూ వీటన్నిటి గురించి చెప్పే పెద్దవారు అందరి ఇళ్లలోనూ ఉండక పోవచ్చు.

మన రామనవమి పండుగ సంప్రదాయ పద్ధతిలో ఎలా జరుపుకోవాలో చెప్పే చిన్న ప్రయత్నం ఇది. శ్రీ రామ నవమి జరుపుకోవాలంటే మరి ఆ పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలియాలి కదా! రామ నవమి రాముని పుట్టిన రోజని కొందరూ, కాదు ఆయన పెళ్లి రోజని మరి కొందరూ, కాదు పట్టాభిషేకమని ఇంకొందరూ అంటారు. నిజానికి రామనవమి ఏ సందర్భం లో జరుపుకుంటాం?

రామ నవమి శ్రీరాముని పుట్టినరోజా లేక పెళ్లిరోజా? (Rama Navami Day is Ram’s Coronation, Birthday or Marriage Day?)

చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశి లో జన్మించాడు. శ్రీ రాముని జననం లోకకళ్యాణ కారకము కనుక ఆరోజునే ఆయన జన్మదినాన్ని, వివాహ మహోత్సవాన్ని,  పట్టాభిషేకాన్ని మనము జరుపుతాము.

శ్రీరామనవమి పూజ ఎలా చేయాలి? (How to Perform Sri Ram Navami Puja?)

సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రంచేసుకోవాలి. రంగవల్లులతో అలంకరించుకోవాలి.మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి.

అభ్యంగన స్నానం ఆచరించాలి. కొత్తబట్టలను ధరించాలి.రామచంద్రుని పటాలను లేదా విగ్రహాలను శుభ్రపరచి అలంకరించాలి. పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి.

బియ్యప్పిండి తో ముగ్గు వేయాలి. పీట మీద పట్టువస్త్రాన్ని గాని నూతన వస్త్రాన్ని గాని వేయాలి. ఆ వస్త్రం పైన సీతారాముల పటాలను లేక విగ్రహాలను ఉంచి షోడశోపచార విధి లో పూజించాలి.

వడపప్పు, పానకాలని నైవేద్యంగా పెట్టాలి. పూజ ముగించిన తరువాత దంపతులకు పండును, విసనకర్రను, తాంబూలమును, యథాశక్తిగా వస్త్రాలను ఇవ్వలి.

ప్రసాదాన్ని బంధు,మిత్రులతో కలసి తీసుకోవాలి. రామకథను మనసారా స్మరించుకొండి.

Sri Rama Navami 2025 Date & Tithi

ఏప్రిల్ 6, 2025 ఆదివారం నాడు రామ నవమి
రామ నవమి మధ్యాహ్న ముహూర్తం – 10:58 నుండి 13:27 వరకు
వ్యవధి – 02 గంటలు 28 నిమిషాలు
సీతా నవమి సోమవారం, మే 5, 2025
రామ నవమి మధ్యాహ్న క్షణం – 12:12
నవమి తిథి ప్రారంభం – 19:26 ఏప్రిల్ 05, 2025
నవమి తిథి ముగుస్తుంది – 19:22 ఏప్రిల్ 06, 2025

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

 

Lord Rama Related Posts

శ్రీ రామ నవమి పూజ విధానం

Vadapappu & Panakam on Rama Navami | శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు?

What is the Specialty of Sri Rama Navami Prasadam?

Sri Rama Navami, the Birthday of a Perfect Man | Sri Rama Navami History

Nama ramayana

Eka sloki ramayana

Rama Ashtakam

Sankshepa Ramayana

Sri Rama Ashtottara Shatanamavali

Sri Rama Sahasranama Stotram – శ్రీ రామ సహస్రనామ స్తోత్రం

శ్రీ రామ అష్టోత్తరనామావళిః – Sri Rama Ashtottara Satanamavali

శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం – Sri Rama ashtottara satanama stotram

సంక్షేప రామాయణం – Sankshepa Ramayanam (Shatashloki)

Sri Rama Apaduddharana Stotram | శ్రీ రామ ఆపదుద్ధారణ స్తోత్రం

Sri Rama Dwadasa Nama Stotram – శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం

Sri Rama Bhujanga Prayata Stotram | శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here