
Varuthini Ekadashi 2027
1వరూధినీ ఏకాదశి
చైత్ర మాసం లో కృష్ణ పక్ష ఏకాదశినాడు వరూధినీ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశం లో ఎక్కువగా ప్రచారం లో ఉంది.
వరూధినీ ఏకాదశి మహిమ (Varuthini Ekadashi Glory)
భవిష్యోత్తర పురాణం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెబుతాడు. ‘ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ, సంఘం లో గౌరవాన్నీ, ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. ‘ అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు.
ఏకాదశి రోజున ఉపవసించి, దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకం లో సకల శుభాలనూ పొందగలరు. వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి.
వరూధినీ ఏకాదశి రోజున కుంభమేళా స్నానం చేసిన వారికి విశేషఫలితాలు లభిస్తాయి. కుంభమేళా సమయం లో వచ్చే వరూధినీ ఏకాదశిని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
వరూధినీ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి..?(How to Observe Ekadashi Vrat..?)
శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణం సకలపాప హరణం. అన్యమైన విషయాలలో మనస్సును చలించనీయక ఏకాగ్ర చిత్తం తో స్వామిని అర్చించాలి. ఉపవాస దీక్షలో పాలు పళ్ళు భుజించ వచ్చు. ఆరోగ్యం సరిగా లేని వారు, చిన్న పిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. నేడు వైష్ణవాలయాలలో ఉత్తరద్వార దర్శనం చేసుకొని స్వామిని మనసారా ధ్యానించాలి.
Varuthini Ekadashi 2027 Date
2027వ సంవత్సరంలో వరూధినీ ఏకాదశి ఏప్రిల్ 29, గురువారం వస్తుంది.
ఏకాదశి తిథి ప్రారంభం: ఏప్రిల్ 28, 2027 న మధ్యాహ్నం 03:52 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు: ఏప్రిల్ 29, 2027 న మధ్యాహ్నం 04:36 గంటలకు
పారణ (ఉపవాస విరమణ) సమయం: ఏప్రిల్ 30, 2027 (శుక్రవారం) ఉదయం 06:44 నుండి 08:21 గంటల వరకు.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
ఉపవాసము వలన కలిగే లాభాలేమిటో మీకు తెలుసా? | Fasting (Upavasam) Benefits in Telugu?
Hari Sayana Ekadasi, Go Padma Vratam, Beginning of Chaturmasya Vrata
Mohini Ekadashi 2023 in English | Mohini Ekadashi Date, Vrat Katha, Puja Vidhi
Nirjala Ekadashi 2023 Date & Puja Timings | Nirjala Ekadashi Importance
Significance of Varuthini Ekadashi | Varudhini Ekadashi 2024
రేపు – భీష్మఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Bhishma Ekadasi in Telugu
Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు
తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Tholi Ekadashi 2025 in Telugu
Yogini Ekadashi Vratham 2025 in Telugu | సకల యోగ దాయకం యోగినీ ఏకాదశి వ్రతం
Nirjala Ekadashi 2025 in Telugu | నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Mohini Ekadashi 2025 in Telugu | మోహినీ ఏకాదశి తేదీ, అర్థం, వ్రత కథ, ప్రాముఖ్యత







