
Nirjala Ekadashi 2026 in Telugu
1నిర్జల ఏకాదశి (When Celebrate Nirjala Ekadashi?)
జ్యేష్ట శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టినవారు నీటిని కూడా తాగరాదు. అందుకే ఈ ఏకాదశికి ఆ పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో నిర్జల ఏకాదశి అత్యంత కఠినమైనది. ఎంతో మహిమాన్వితమైనది కూడా. ఈ ఏకాదశినే పాండవ ఏకాదశి లేదా భీమ ఏకాదశి అంటారు. నియమ నిష్టలతో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు ఆచరించిన ఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశిని ఆచరించినవారు తనకు అత్యంత ప్రీతి పాత్రులనీ, ఇహలోకం లో వారి సకల అభీష్టాలనూ నెరవేర్చి, సర్వపాపాలనూ హరించి జన్మాంతం లో తన సాన్నిధ్యానికి చేర్చుకుంటాననీ శ్రీ మహావిష్ణువు పలికిన విధంగా మార్కండేయ పురాణం చెబుతుంది.
నిర్జల ఏకాదశిని భీమ ఏకాదశి అని ఎందుకంటారు?
పాండవులు శ్రీకృష్ణునికి పరమ భక్తులు. వారు ప్రతి ఏకాదశినాడూ ఉపవాస దీక్షను చేసే వారు. అయితే మహాబలుడైన భీమసేనుడు ఉపవాసదీక్షను చేయలేకపోయేవాడు. ఆయన ఈ విషయమై చింతిస్తుండగా శ్రీ కృష్ణుడు భీముని తో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలను ఆచరించిన ఫలితం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు భీమసేనుడు అతి కఠినమైన నిర్జల ఏకాదశిని భక్తిగా ఆచరించి 24 ఏకాదశి వ్రతాల పుణ్యఫలాన్ని సంపాదించుకున్నాడు. అందుచేత ఈ రోజును భీమ ఏకాదశి అని కూడా అంటారు.
నిర్జల ఏకాదశిని ఎలా ఆచరించాలి? (How to Celebrate Nirjala Ekadashi?)
నిర్జల ఏకాదశిని ఆచరించదలచినవారు జ్యేష్ట శుక్ల ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే స్నానాదికాలను ముగించుకుని ఉపవాస దీక్షను ప్రారంభించాలి. నిర్జల ఏకాదశినాడు వ్రతదీక్షలో ఉన్నవారు మంచినీరు కూడా తీసుకోరాదు. నిరంతర విష్ణుధ్యానం లో గడపాలి. విష్ణు సహస్రనామాలని పఠించాలి.
ఉపవాస విరమణ (Breaking the Fasting)
ద్వాదశినాడు ఉపవాస విరమణతో దీక్షపూర్తవుతుంది. ద్వాదశినాడు స్వామికి షోడశిపచార పూజను చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని భుజించి ఉపవాస విరమణ చేయాలి.
Nirjala Ekadashi 2025 Date
- ఏకాదశి తేదీ: గురువారం, జూన్ 25, 2026
- ఏకాదశి తిథి ప్రారంభం: జూన్ 24, 2026 (సాయంత్రం 06:12)
- ఏకాదశి తిథి ముగింపు: జూన్ 25, 2026 (రాత్రి 08:09)
- పారణ (ఉపవాస విరమణ) సమయం: శుక్రవారం, జూన్ 26, 2026 (ఉదయం 05:25 నుండి 08:13 వరకు)
Related Posts
Nirjala Ekadashi 2025 | నిర్జల ఏకాదశి పవిత్రమైన ఆచారాలు, పూజా విధానం, వ్రత కథ మరియు ప్రాముఖ్యత.
Nirjala Ekadashi 2026 Date & Puja Timings | Nirjala Ekadashi Importance
https://hariome.com/2023-festival-calendar/
Mohini Ekadashi 2023 in English | Mohini Ekadashi Date, Vrat Katha, Puja Vidhi
Amalaki Ekadashi 2027 | అమలక ఏకాదశి, విశిష్టత, ఏం చేయాలి, పూజా విధానం
Significance of Varuthini Ekadashi | Varudhini Ekadashi 2024
Mohini Ekadashi 2025 in Telugu | మోహినీ ఏకాదశి తేదీ, అర్థం, వ్రత కథ, ప్రాముఖ్యత









Very helpful & handy ! Good work.