Hanuman Jayanti 2026 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి

1
15015
Hanuman Janmotsav, hanuman jayanthi history
Hanuman Janmotsav Significance

Hanuman Janmotsav 2026

1తెలుగువారి హనుమాన్ జన్మోత్సవం

వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి శనివారం మధ్యాహ్నం, పూర్వాభాద్ర నక్షత్రంలో అంజనామాత శ్రీ ఆంజనేయ స్వామికి జన్మనిచ్చారు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడైన శ్రీ ఆంజనేయుడు సృష్టి, స్థితి, లయలకు కారణుడు. వేదవేదాంగ తత్వాలను గురించి తెలిసిన ఈ జ్ఞాని అన్ని విద్యలలోనూ మేటి.

దేవతలు, మహర్షులు, రాక్షసులతో సహా అందరికీ ఆశ్చర్యం కలిగించే వజ్ర దేహంతో, కపి రూపంతో, సమస్త శుభ లక్షణాలతో, కిరీటం, బంగారు భుజకీర్తులు ధరించి శ్రీ బాలాంజనేయ స్వామి విష్ణువు యొక్క అవతారంలా దేదీప్యమానంగా వెలిగారు.

ఆయన జన్మించినప్పుడు పువ్వుల వర్షం కురిసి, దేవదుందుభులు మ్రోగగా, దేవతలు, గంధర్వులు నృత్యం చేసి, సిద్ధులు, చారణులు స్తోత్రాలు పాడారు.

కొన్ని రోజుల తరువాత అమావాస్య రాత్రి, ఆకలితో ఉన్న శ్రీ బాలాంజనేయుడు తల్లిని ఆహారం కోసం అడిగాడు. అప్పుడు ఆయనకు కనిపించిన సూర్యుడిని ఫలంగా భావించి ఆకాశంలోకి ఎగిరి దానిని పట్టుకున్నాడు.

దీనిని చూసి ఆశ్చర్యపోయిన ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు. ఆ తరువాత బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. కానీ శ్రీ ఆంజనేయుడు తన రోమాలతో వాటిని అడ్డుకున్నాడు.

బ్రహ్మాది దేవతలు ఆయన శక్తిని గుర్తించి ఆశీర్వదించారు. రాక్షసులను సంహరించి, సీతాదేవిని జాడ కనుగొని, శ్రీరామునికి సహాయం చేయమని ఆదేశించారు.

అంతేకాకుండా హనుమంతుని పూజించిన వారందరూ దేవతలను పూజించినట్లే ఫలితం పొందుతారని, రాక్షసులను సంహరించడానికి ప్రతి గ్రామంలోనూ శ్రీ ఆంజనేయ స్వామి కొలువు ఉండాలని బ్రహ్మదేవుడు వాక్కు ఇచ్చాడు.

శ్రీ ఆంజనేయునికి దీర్ఘాయువు, బలం, పరాక్రమం, ఆరోగ్యం, గుణాలు, బుద్ధి, విద్య, తపస్సు, తేజస్సు, వాక్పటుత్వం, ప్రసన్నత, చతురత, ధైర్యం, వైరాగ్యం, విష్ణు భక్తి, దయ, పర స్త్రీ విముఖత, ఏ అస్త్రంతోనూ జయించలేని శక్తి వంటి అనేక వరాలు లభించాయి.

 హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకోడానికి మరో బలమైన కారణం ఉంది. కలౌ పరాశర స్మృతిః అని శాస్త్రం కనుక పరాశర స్మృతి లో

శ్లో : వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
      పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే |

అని చెప్పబడినది కనుక ఆ ప్రకారంగా వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.  ఉయ్యూరు లోని సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు అంగరంగ వైభవంగా సువర్చలా ఆంజనేయుల వివాహ మహోత్సవం జరుగుతుంది.

హనుమంతుని జనన గాథను, హనుమాన్ చాలీసాను, ఆంజనేయ స్తోత్రాలను ఈ రోజు ప్రత్యేకంగా పారాయణ చేస్తారు.

Hanuman Janmotsav 2026 Date:

హనుమాన్ జయంతి, మంగళవారం, మే  12, 2026

దశమి తిథి ప్రారంభం – మే 11, 2026న మధ్యాహ్నం 03:24 గంటలకు
దశమి తిథి సమాప్తం – మే 12, 2026న మధ్యాహ్నం 02:52 గంటలకు

హనుమాన్ జయంతి రోజు ఏమి చేయాలి? (What to Do on Hanuman Jayanti?)

1. హనుమాన్ జయంతి రోజున నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానమాచరించి హనుమంతుడిని పూజించడం మంచిది.
2. హనుమాన్ చాలీసా మంత్రాన్ని పఠించండి.
3. హనుమాన్ కి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించడం మంచిది .
4. హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలు తమలపాకులు, బేసన్ లడ్డు, మోతీచూర్ లడ్డు, జాంగ్రీ, కేసరి బాత్, తీపి రొట్టెలు, బెల్లం, శనగలు మొదలైనవి ప్రసాదాలగా సమర్పించండి.
5. ఉపవాసం చేయడం మంచిది. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం.
6. సుందరకాండ, బజరంగ్ బాన్ సుందర్‌కాండ్, రామాయణ రామ్ రక్షా స్త్రోత్తం మరియు హనుమాన్ చాలీసా పఠించాలి.
7. కుదిరితే హనుమాన్ జయంతి రోజున ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయాలి.
8. దేశీ నెయ్యి దీపం వెలిగించాలి.
9. హనుమాన్ జయంతి రోజున హనుమాంతుడి వెర్మిలియన్ రంగు లంకెను ధరించాలి.
10. ఇంటి పైకప్పుపై ఎర్ర జెండాను ఎగురవేయాలి.

ముఖ్యమనవి.

హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవం అని పిలుద్దాం ఎందుకంటే జయంతి అనే పదం లోకంలో లేని వారికి ఉపయోగిస్తారు. కాని హనుమాన్ జీ చిరంజీవి అనగా చావు లేని వాడు అని అర్ధం. హనుమాన్ ఇంక జీవించే ఉన్నారు. అందుకే హనుమాన్ జన్మోత్సవం అని పిలుద్దాం అని మేము కోరుకుంటున్నాము. ఈ మార్పును హనుమాన్ ఆశీస్సులతో ఈ రోజే మొదలుపెడదాం. ఈ సందేశాన్ని అందరికి తెలిసేల షేర్ చెయండి.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here