ఏడు వారాల నగలంటే? | Traditional Seven Week Jewellery in Telugu

0
16788
Traditional Seven Week Jewellery in Telugu

Traditional Seven Week Jewellery – ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ వుంగరాలు మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు. వీటిని స్త్రీలు వారం రోజులూ ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం, ఆరోగ్యం కోసమూ బంగారు ఆభరణాలు ధరించేవారు. వాటినే ఏడువారాల నగలు అనే వారు. ఇప్పటికీ అందరికీ ఆసక్తి ఏడు వారాల నగలు అంటే ఏమిటో తెలుసుకోవాలని.

  • ఆదివారము – సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి.
  • సోమవారము -చంద్రుని కోసము ముత్యాల హారాలు, ముత్యాల గాజులు మొదలగునవి.
  • మంగళవారము – కుజుని కోసము పగడాల దండలు, పగడాల ఉంగరాలు మొదలగునవి.
  • బుధవారము – బుధుని కోసము పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
  • గురువారము – బృహస్పతి కోసము పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.
  • శుక్రవారము – శుక్రుని కోసము వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక మొదలగునవి.
  • శనివారము – శని కోసము నీలమణి హారాలు మొదలగునవి.

ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అప్టెశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాధిస్తాయని నమ్మకం. అందుకోసమే ఏడు వారాల నగలుగా ప్రసిద్ధి చెందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here