వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి వినాయక ప్రతిమను వ్యాపార సముదాయములు నందు ఉంచవలెను ?

0
7683

images (7)

మన పూజా కార్యక్రమలులో లో గణపతి కి విశేషమైన ప్రాధాన్యం ఉంది.గణపతికి మొదటి పూజ చేస్తాము అలాంటిది వాస్తు విషయం లో కూడా గణపతి కు తగిన స్థానము ఉంటుంది .

గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు కావున అలంకరణ విషయం లో కూడా గణపతి మూర్తి ని వాడడం విశేషం, దానికే మనం కొద్దిగా వాస్తు కూడా జోడించి, ఈ ప్రతిమలను అలంకరించుకొంటే అన్ని విధముల మంచి జరుగుతుంది.

నిల్చుని ఉన్న ప్రతిమ ను షాప్స్, ఆఫీసులలో, పరిశ్రమలలో ఉపయోగించడం వలన అబివృద్ది ఉండదు. ముఖ్యం గా వినియోగదారుల కొనుగోలు సంఖ్య తగ్గుతుంది. అటువంటి ప్రదేశాలలో కూర్చిని ఉన్న గణపతి ని ఉంచడం మంచిది. ఇంట్లో నిల్చుని ఉన్న గణపతి ఉండడం వలన సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి.ఉత్తర దిశ వైపు ఉంచే గణపతి ఆకుపచ్చ రంగులో ఉండడం మంచిది, అలాగే దక్షిణ దిక్కులో ఉండే గణపతి పగడం లేదా ఎరుపు రంగు లోఉండడం, తూర్పు దిశ లో ఉండే గణపతి స్పటికం లేదా చలువరాతి తో ఉండడం, పశ్చిమం లో నీలం రంగులో ఉండే గణపతి మూర్తులను ఉంచడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here