కరవీర పత్రం | karaveera patram in Telugu

0
2789
Nerium_indicum_HariOme
కరవీర పత్రం | karaveera patram

కరవీర పత్రం | karaveera patram

వికటాయ నమః కరవీర పత్రం సమర్పయామి।

దీనినే గన్నేరు అంటారు. సంస్కృతం లో దీనికి హరప్రియ, గౌరీ పుష్ప, గణేశ కుసుమ, చండీ కుసుమ, అశ్వమారక, హయమారక అనేవి పర్యాయనామాలు. ఇది తెలుపు, పసుపు మరియు ఎరుపు రంగుగల పువ్వులతో మూడు రకములు. వీటినే సంస్కృతం లో రక్త మరియు పీత కరవీర అని అంటారు. రక్త కరవీర శాస్త్రీయ నామము – నీరియమ్ ఇండికమ్ (Nerium Indicum), పీత కరవీర Thevetia poveflora, ఇవి Apocynaceae జాతికి చెందినవి.

కరవిర తిక్త, కటు, కషాయ రసములు కల్గి యుంటుంది. దీని పాలు మొండి వ్రణములను, వాపులు, కడుపులో రక్త గడ్డలు మరియు వ్రణములను పోగొడుతుంది. వృశ్చిక దంశము (తేలుకాటు) నందు దీని పాలను పూతగా పెట్టి కాపుతారు.

వీటి కాయలు గుండ్రంగా ఉండి, రెండు విత్తనములు కల్గి ఒకదానికి ఒకటి అతికినట్లు ఒక గీత ఉంటుంది. గన్నేరును పైపూతకు మాత్రమే వాడుతారు. లోనికి సేవిస్తే దీని విష ప్రభావము చేత గర్భిణులకు గర్భపాతము మరియు ఇతరులకు మరణము కూడా కలుగుతుంది. పూర్వ కాలమున యుద్ధములందు దీని విత్తనములను దంచి గుర్రములకు విష ప్రయోగము చేసేవారు. అందుచేత దీనికి అశ్వమారక, హయమారక అని పేర్లు కలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here