వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

1
5963

couple doing pooja-HariOme

వైవాహిక జీవితములో ఎదుర్కొనే సమస్యలు సాదరణంగా ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • వివాహము ఆలస్యం అవడము
  • వివాహ అనంతరము సంసార సమస్యలు
  • ఆలుమగల మధ్య గొడవలు

ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ రాయడానికి వీలు ఉన్నవి,లేనివి కూడా చాలా ఉన్నాయి .
అసలు ఆయా సమస్యలు రావడానికి గల కారణం ఏమిటి ?
ఏ గ్రహముల ప్రభాముల వలన ఇటువంటి సమస్యలు వస్తాయి ?
గత జన్మ పాపాలు /శాపాలు వైవాహిక వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయా ?
వంటి వాటంన్నిటికి విడివిడిగా పరిహారములు ఏమిటి వంటివి వివరంగా చెప్పడానికి ప్రస్తుతం సమయం చాలదు కనుక తర్వాత పోస్టులలో వాటి గురించి తెలుసుకుందాము .

ఇక ప్రస్తుతానికి ఈ వినాయక చవితి రోజున ఎలాంటి తంత్ర పరిహారము చేయడము వలన ఉపశమనం లభిస్తుంది అనేది తెలుసుకుందాము .

ప్రధానంగా వైవాహిక జీవితము మీద అంగారక, బృగువు గ్రహముల ప్రభాము బాగా ఉంటుంది .కనుక ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తమున నిద్ర లేచి ఇల్లు మొత్తము కూడ శుచిగా సుబ్రపరుచుకున్న తర్వాత నీటిలో స్వల్పంగా గోముత్రము, కళ్ళు ఉప్పు (raw salt) పసుపు వేసి ఫ్లోరింగ్ ను తుడుచుకోవాలి .
అరటి ఆకు మీద మల్లెపూలు లేదా మంచి వాసన ఉండే తెలుపు రంగులో ఉన్న పూలను (విడి పూలు) చల్లి అందులో విగ్నేశ్వరుడిని ఉంచి గన్నెరుపూల మాలా ను లేదా బంతి పూల మాల, రుద్రాక్ష మాల స్వామి వారికి అలంకరించాలి .

ప్రసాదము :-

కుడుములు, ఉండ్రాళ్ళతో పాటు పంచదార కల్పిన పాలన్నం, గారెలు, పులిహోర, బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిరి ముద్దలు ,ఏదేని ఊరగాయ కలిపిన చిన్న చిన్న 9 అన్నం ముద్దలు
ఈ విదమైన ప్రసాదములతో నైవేధ్యం పెట్టి దూప ,దీపములతో అర్చించి సంకల్పం చెప్పుకున్న పిదప ……గారెలు ,పులిహోర బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిరి ఉండలు ,ఊరగాయ అన్నం వంటి వాటినన్నింటిని ప్రసాదముగా పంచి ఇంట్లో ఉన్న మీ పెద్దలకు పాద నమస్కారము చేసి పూజా అక్షాంతలతో ఆశీర్వాదము తీసుకోవాలి .
తదుపరి మీకు వివాహము అయితే బార్యాభర్తలు ఇద్దరు కలిపి ,కాకపోతే మీరు ఒక్కరూ మాత్రమే ఉండ్రాళ్ళను, కుడుములను, ఉండ్రాళ్ళతో పాటు పంచదార కల్పిన పాలన్నం ను స్వీకరించిన తర్వాత కుటుంబ సబ్యులకు పంచాలి.

అవకాశము ఉన్నవారు ఈ రోజు ఉదయం మందేశ్వర ముహూర్తం లో అనగా గం 07:05 లనుండి 07: 49 ని “ లలోపల నానబెట్టిన నువ్వులు ,కందులు ,ఉలవలు ,మినుములను గోమాత కు మీ స్వహస్తాలతో తినిపించాలి .

తిరిగి వచ్చే సమయములో దేవాలయ దర్శనము చేసుకొని దారిలో బెల్లం ను సేకరించి ఇంటికి వచ్చిన పిదప స్వీకరించాలి. వీలైతే ఈ విదంగా 5 రోజులు చేస్తే చాలా ప్రశస్తము .

తదుపరి పోస్టులో సంతాన సమస్యలు తొలగుటకు పరిహారముల గురించి తెలుసుకుందాము .

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు .
astroguru81@gmail.com
ఒంగోలు
సెల్ : 9246461774

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here