
దుత్తూర పత్రం | Duttura Patram
హరసూనవే నమః దుతూర పత్రం సమర్పయామి
Duttura Patram దుత్తూర అనగా ఉమ్మెత్త సంస్కృతం లో దీనికి కనక ఉన్నత్త, శివప్రియ అనేవి పర్యాయ నామములు. దీని శాస్త్రీయ నామం దాతుర మెటల్(datura metel), కుటుంబం సొలనేసి (Solanaicae).
ఇది వంకాయ జాతికి చెందిన మొక్క ఇది శ్వేత, నీల మరియు పీతవర్ణ పుష్పములచే మూడు రకములుగా ఉంటుంది. దీని పుష్పములు పొడవైన కాడను కలిగి, గంట ఆకారంలోను, ఫలాలు గుండ్రంగా ముళ్ళతోకూడి ఉంటాయి. దీనియందు ఉన్మాదము కలిగించే గుణముండుటచేత దీనికి ‘ఉన్మత్త’యని పేరు. దీని యందు విశేష ఔషధ గుణములు కలవు. దీనినుంచి, దీని జాతికి చెందిన వివిధ మొక్కల నుంచి Atropine, Hyocyamine etc ఆల్కలాయీడలు ఆధునిక వైద్యం మరియు హోమియోపతి నుందు విశేషంగా వాడుతున్నారు. దీనిని విశేషంగా జ్వర, కుష్ట కృమి, వ్రణ రోపణము మరియు వేదనాహరముగా వాడతారు. శ్వాస మరియు కాసవ్యాధులలో ఇది ప్రత్యేక ఔషధము. ఇది విష ప్రభావమును శరీరమున వ్యాపించకుండా నిరోధించగలదు.
” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం “.
మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.
ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com