బిల్వపత్రం | Bilva Patram in Telugu

0
2540

 

 

 

బిల్వపత్రం | Bilva Patram
Bilva Patram in Telugu

బిల్వపత్రం | Bilva Patram in Telugu

ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి-

Bilva Patram in Telugu సంస్కృతంలో దీనికి శ్రీఫల, మాలూర, శైలూష, శాండిల్య అనేవి పర్యాయ నామములు. దీని శాస్త్రీయ నామము అయిగల్ మార్మియోలాస్ (Aegle marmeolus), కుటుంబం— రూటేసి(Rutaceae).

తెలుగులో దీనిని మారేడు అని అంటారు. మూడు పత్రములు కలదానిని బిల్వపత్రము లేక మారేడు దళముగా వ్యవహరిస్తారు. ఏక బిల్వమందు ఒకే పత్రము మూడుగ చీలి ఉంటుంది.

 శివునికి చాలా ప్రీతి పాత్రమైనది బిల్వదళము. ఏక బిల్వమునకు విశేష ప్రాశస్త్యము కలదు. బిల్వాష్టకంలో దీని ప్రాధాన్యత విశేషముగా వర్ణింపబడింది.

బిల్వదళమునందు త్రిశూలము వలె మూడు దళములు ఒకే మూలము నుంచి వచ్చి, ఇవి త్రిగుణములను (సత్వ రజ, తమో గుణములను) ప్రతిబింబిసాయి. మూడు దళములు ఒకే మూలము నుంచి బయలుదేరినట్లే త్రిగుణములు కూడా పరమాత్మ లేక మూల ప్రకృతి నుంచి ఆపాదింపబడినవి. ఈ రెంటిలోను మధ్యదళము రెండింటి కన్నా ఎత్తున ఉండి శివుని యొక్క రజోగుణ ప్రాధాన్యమైన రాజసము మరియు తేజస్సును ప్రతిబింబిస్తుంది.

శక్తి స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మికి కూడా బిల్వము ప్రీతిపాత్రమైనదిగా లక్ష్మీ అప్లోత్తరమున “బిల్వనిలయాం” అని, వారాహ పురాణాంతర్గత దేవాదికృత లక్ష్మీస్తుతి యందు “పక్వ బిల్వఫలాపీన తుజ్ఞస్తవ్యై నమః”,”బిల్వ వనస్థాయైనమ” అని స్తుతింపబడినది.

 పత్రములు (బిల్వమూలము) మరియు బెరడు మధు మేహంలో ఔషధంగా వాడుతారు. పక్వమైన ఫలములు బంగారు వర్ణము కలిగి లోపలి గుజ్జు సుగంధము కలిగి, బంగారు వర్ణముగల తేనె వంటి ద్రవము ఉంటుంది. ఈ గుజ్జు ఆమాశయ శోధకము (Bowel regulation) మరియు రక్త శుద్ధికి వాడతారు.

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here