బృహతీ పత్రం | Bruhati Patram
గణాధిపాయ నమః బృహతీ పత్రం సమర్పయామి!
Bruhati Patram సంస్కృతంలో దీనికి వార్తాకీ, కంటకారి, క్షుద్ర భంటాకీ, మహతీ, కులీ, సింహీ అనేవి పర్యాయనామాలు. దీని శాస్త్రీయ నామం సొలానమ్ ఇండికమ్ (Solanum indicum), కుటుంబం – సొలనేసి (Solanaceae).
దీనిని తెలుగులో ములక అని అంటారు. ఇది చిన్నములక, పెద్ద ములక అని రెండు రకములు. వీటినే బృహతీద్వయముగ వైద్యశాస్త్రమున వ్యవహరిస్తారు. దీని వేరు దశమూలములలో ఒకటి. చిన్న ములక ఆకృతిలో చిన్నదిగానూ, పెద్దములక పెద్దదిగానూ ఉంటుంది. ముళ్ళను కల్గియుండుట చేత దీనికి కంటకారి అని అంటూరు.
దీని పత్రములు వంకాయ పత్రముల వలె ఉండి, తెల్లని చారలు కలిగిన గుండ్రని పండ్లతో ఉంటాయి. పండిన ఫలములు పసుపు పచ్చగానూ, ముళ్ళ బంగారు రంగులోను ఉంటాయి. దీని మూలము ఆమపాచకముగాను, హృదయమునకు హితముగాను ఉంటుంది. ದಿನಿನಿ శ్వాస మరియు కాస వ్యాధులయందు విశేషముగ వాడుతారు.
” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం “.
మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.
ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com