గణపతికి సమర్పించు పత్రిలో ఉండే ఔషధ గుణాలు | Ganesh Patri (leaves) Health Benfits in Telugu

0
7799
 Ganesh Patri Health Benefits in Telugu
Ganesh Patri Health Benefits in Telugu

 Ganesh Patri Health Benefit’s in Telugu

వినాయక పూజలో ఉపయోగించే పత్రాలు గురించి తెలుసుకుందాం. 

గణపతికి సమర్పించే పత్రి (పత్రాలు) ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని వేదాలు, ఆయుర్వేద గ్రంథాలు కూడా ప్రస్తావించాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా వినాయక చవితి పూజలో ఉపయోగించే 21 పత్రాలలోని ఔషధ గుణాలు ఇలా ఉన్నాయి:

సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి
నేత్రములకు మంచి ఔషధము. ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి.

గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
నేలమునుగ ఆకులు – ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. శరీరమునకు దివ్యఔషధము.

ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి
మారేడు ఆకులు – మూల శంక నయమగును. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి.

గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
జంటగరిక ఆకు – మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును. పచ్చడి చేసుకొని తినవలెను.

హరసూనవే నమఃదత్తూరపత్రం పూజయామి
ఉమ్మెత్త ఆకు – మానసిక రోగాలు తొలగును. ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి.

లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామి
రేగు ఆకు – శరీర సౌష్టవానికి శ్రేష్టం. మితంగా తింటే మంచిది.

గుహాగ్రజాయ నమఃఅపామార్గపత్రం పూజయామి
ఉత్తరేణి ఆకులు – దంతవ్యాధులు నయమగును. ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.

గజకర్ణాయ నమఃతులసీపత్రం పూజయామి
తులసీ ఆకులు – దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి. రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది.

ఏక దంతాయ నమఃచూత పత్రం పూజయామి
మామిడి ఆకు – కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును. మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి.
వికటాయ నమఃకరవీర పత్రం పూజయామి
గన్నేరు ఆకు – జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు]

భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామి
అవిసె ఆకు – రక్త దోషాలు తొలగును. ఆకు కూరగా వాడవచ్చు.

సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామి
మద్ది ఆకులు – వ్రణాలు తగ్గును. వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి.

సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామి
దేవదారు ఆకులు – శ్వాశకోశ వ్యాధులు తగ్గును

ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామి
మరువం ఆకులు – శరీర దుర్వాసన పోగొట్టును. వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను.

హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామి
వావిలి ఆకు – ఒంటినొప్పులను తగ్గించును. నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది.

 

సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
గండకీ ఆకు – వాత రోగములు నయమగును

ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి
జమ్మి ఆకులు – కుష్ఠు వ్యాధులు తొలగును. ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి.

శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
జాజి ఆకులు – నోటి దుర్వాసన పోగొట్టును. ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.

వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
రావి ఆకులు – శ్వాసకోశ వ్యాధులు తగ్గును. పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది.

వటవే నమః దామిడీ పత్రం పూజయామి
దానిమ్మ ఆకు – అజీర్తి, ఉబ్బసం తగ్గును. పొడిచేసి కషాయంగా తాగవచ్చు.

కపిలాయ నమఃఅర్క పత్రం పూజయామి
జిల్లేడు ఆకులు – వర్చస్సు పెంచును.

Related Stories:

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

Sankashtahara Chaturthi 2025 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

అష్ట వినాయక దర్శనం ? | Ashta Vinayaka Darshanam in Telugu?

ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఎటువంటి గణపతిని ఆరాధించాలి? | Success with the Power of Ucchista Ganapati in Telugu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here