శబరిమల యాత్ర ఎందుకు చెయ్యాలి? | Why we Need to do Sabarimala Yatra in Telugu

1
14867

1891_ayyappa-hd-wallpaper-03

Sabarimala Yatra / శబరిమల యాత్ర ఎందుకు చెయ్యాలి?

Back

1. అయ్యప్ప మాల అంతరార్థం

మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.

భజన
పడిపూజ
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో “హరివరాసనం” లేదా “శ్రీ హరిహరాత్మజాష్టకం”గానం చేయడం ఒక సంప్రదాయం.

శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని “కుంబకుడి కులతూర్ అయ్యర్” రచించాడు.

1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు.

మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు.

అప్పట్లో “ఈశ్వరన్ నంబూద్రి” అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు.

అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో “హరివరాసనం” స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు.

ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, “స్వామి శరణు” అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం –

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here