Subramanya Shasti 2025 | సుబ్రహ్మణ్య షష్ఠి పూజ విధి, ఉపవాస నియమాలు, వ్రత కథ.

0
23518
Subramanya Swamy Sashti Significance & Puja Vidh in Telugu
What are the Subramanya Swamy Sashti Significance & Puja Vidh in Telugu?!

Subramanya Swamy Shashti 2025

1సుబ్రహ్మణ్య షష్టి అనగా ఏమిటి..? పెళ్లి కానివారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు ఏమి చేయాలి?

గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్యస్వామి. షణ్ముఖుడు, కార్తీకేయుడు, వేలాయుధుడు, కుమారస్వామి గా పేరు గడించిన స్వామి కారణజన్ముడు.

తారకాసురుడు, సురావణుడు మరికొందరు రాక్షసులు ప్రజలను, దేవతలను హింసిస్తూ ఉండేవారు. ఈ అసురల బారి నుండి కాపాడమని బ్రహ్మను కోరగా, శివ పార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని చెప్పాడు. ఆ రకంగా పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో కుమారస్వామి పుట్టుక విలక్షణమైనది.

శివాంశతో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు. గంగాదేవి ఆ పుత్రుని భారం మోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది.

అప్పుడు కృత్తికా దేవతలు ఆరుగురు తమ స్తన్యమిచ్చి పెంచుతారు. రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అని, కృత్తికా దేవతలు పెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినది అని పురాణాలు చెబుతున్నాయి. ఆరు ముఖాలు కలిగినందు వల్లన షణ్ముఖుడు అని అంటారు. నెమలి వాహనం కలిగిన స్వామి గణేశునికి సోదరుడు. ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకు, ఒకటి మనసుకు ప్రతీక.

స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమే సొంతం. సేనాపతిగా సకల దేవగణాల చేత పూజలు అందుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితే గౌరిశంకరుల కటాక్షం లభిస్తుందని ప్రతీతి. తారాకాసురుడిని సంహరించిన కుమార స్వామి మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు జన్మించాడు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖుని ఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగి, శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం. ఆషాడమాస శుక్ల పక్ష పంచమి, షష్టిని పర్వదినాలుగా జరుపుకొంటారు. శుక్ల పక్ష పంచమిని స్కంద పంచమని, షష్టిని కుమార షష్టి అని భావించి భక్తులు ఆ రెండు రోజుల విశేష పూజలు చేస్తారు.

సుబ్రహ్మణ్య షష్టి పూజా విధానం (Subramanya Shashti Puja Vidh)

పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్టి నాడు కుమారస్వామి ని పూజించినట్లైతే నాగ దోషాలు తొలగుతాయని, ఙ్ఞానం వృద్ధి కలుగుతుందని, కుజదోషాలు తొలగుతాయని, సంతానం కలుగుతుందని నమ్మకం.

హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతి సుముఖ పంకజ పద్మబందో
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ సనాధ మమదేహి కరావలంబం

సుబ్రహ్మణ్య షష్ఠి 2024 తేదీ & ముహూర్తం (Subrahmanya Sashti 2024 Date & Muhurth)

సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్  26, 2025 బుధవారం రోజున

తిథి ప్రారంభం – 25 నవంబర్ 2025న 10:56 PM  నుండి
తిథి ముగుస్తుంది – 27 నవంబర్ 2025న  12:01 AM వరకు

Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here