
Annapurna Jayanti 2026
1అన్నపూర్ణ జయంతి 2026
మన హిందూ క్యాలెండర్ అనుసరించి అన్నపూర్ణ జయంతి మార్గశీర్ష మాసం, పౌర్ణమి నాడు జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం, మార్గశీర్ష పూర్ణిమ రోజున పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో భూమిపై అవతరించింది. అందువలన ఈ రోజును అన్నపూర్ణా దేవి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూర్తి భక్తి, శ్రద్దలతో హిందూ భక్తులు పూజిస్తారు. ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూజించడం వలన ఇంట్లో సమృద్ధి, శ్రేయస్సు లభిస్తుంది. అన్నపూర్ణా దేవి ప్రతి ఒక్కరి ఇంటిలో కొలువై ఉంటుంది. అన్నపూర్ణ దేవి జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 15న వచ్చింది. అయితే అన్నపూర్ణ జయంతి శుభ సమయాలు మరియు ప్రాముఖ్యత గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.
అన్నపూర్ణ జయంతి 2026 ముహూర్తం (Annapurna Jayanti 2026 Date & Muhurt) :
అన్నపూర్ణ జయంతి 2026 డిసెంబర్ 23, బుధవారం నాడు వస్తుంది.
పౌర్ణమి తిథి ప్రారంభం: డిసెంబర్ 23న ఉదయం 10:47 గంటలకు
పౌర్ణమి తిథి ముగింపు: డిసెంబర్ 24, ఉదయం 06:58 గంటలకు
అన్నపూర్ణ జయంతి పూజ విధి (Annapurna Jayanti Puja Vidhi / Rituals):
1. అన్నపూర్ణ జయంతి రోజున ఉదయం లేచి స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి
2. ఆ తరువాత గంగాజలంతో ఇంట్లో, ఇంటి ఆవరణలో చల్లి శుద్ధి చేయండి.
3. ఇంట్లో వంటకు ఉపయోగించే పొయ్యికి లేదా గ్యాస్ ను పసుపు, కుంకుమతో పూజించండి.
4. ఇంట్లో ధూపం వెలిగించి ఆ ధూపం దీపంతో పొయ్యికి పూజ చేసి బియ్యం, పూలు సమర్పించాలి.
5. ఈ రోజున అన్నపూర్ణ దేవిని పూజిస్తారు.
6. అన్నపూర్ణ దేవికి ‘అన్నాభిషేకం’ సమర్పించాలి.
7. అన్నపూర్ణ దేవిని దివ్య ఆశీర్వాదం కోసం మహిళలు ఈ రోజున ఉపవాసం ఉంటారు.
8. ఆ రోజు రాత్రి అన్నపూర్ణా దేవిని పూజ చేసి ఆ తర్వాత ఉపవాసం విరమించుకుంటారు.
9. ఈ రోజున ‘అన్నపూర్ణా దేవి అష్టకం’ పారాయణం చేయడం వలన అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది.
అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత (Annapurna Jayanti Importance) :
1. అన్నపూర్ణ జయంతి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ.
2. ఇది ఆహార దేవత అయిన అన్నపూర్ణ దేవతదేవి అంకితం చేయబడింది.
3. మన పురాణాల ప్రకారం, భూమి నుంచి ఆహారం కొరత ఏర్పడినప్పుడు, జనులందరు బ్రహ్మ, విష్ణువు మరియు శివుడిని ప్రార్థించారు.
4. అప్పుడు పార్వతీ దేవి అన్నపూర్ణ దేవి గా కనిపించి భూమిపై ఆహారాన్ని నింపింది.
5. అప్పటి నుండి ఈ రోజును అన్నపూర్ణ జయంతిగా జరుపుకుంటారు.
6. ఈ రోజున వంటగదిలో పూజ నిర్వహించడం మంచిది గా భావిస్తారు.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Next Coming Important Days
ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala
Gita Jayanti 2026 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?
వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration
Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు
Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ
Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర
Sankashtahara Chaturthi 2026 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?







