
How Lord Hanuman Got His Name
ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చిందో తెలుసా!
ఆంజనేయునికి సుందరుడనే పేరు ఉంది. ఆంజనేయునికి ప్రతీకగా రామాయణం లో సుందరకాండం ఉంటుంది. మరి సుందరుడు హనుమంతుడు ఎలా అయ్యాడు?
హనుమంతుడు అంటే విరిగిన దవడలు కలవాడన్న అర్థం వస్తుంది. ఆంజనేయునికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
చిన్న తనంలో ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుని చూసి ఫలమనుకుని నోట పెట్టుకున్నాడు. మొల్లోకాలూ గాఢాంధకారం లో మునిగిపోయాయి. పసిబాలుని శక్తికి ఇంద్రుడు కూడా ఉలిక్కిపడ్డాడు. బాలుని దుస్సాహసానికి కోపించి తన వజ్రాయుధం ఆంజనేయునిపైకి విసిరాడు. మహా శివుని అంశగా వాయుదేవుని వరంతో జన్మించిన ఆ మహాశక్తి సంపన్నుడైన ఆంజనేయుడు వజ్రాయుధం తగిలినా మరణించలేదు. ఆయుధం తగిలిన చోట దవడలు విరిగి మూర్చిల్లాడు. ఇంద్రుడు బాలునిపై చేసిన ఘాతుకానికి ఒక గుహలోనికి వెళ్ళి వాయుదేవుడు స్తంభించాడు.జీవులన్నీ ప్రాణవాయువు లేక మృతిచెందసాగాయి. ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వాయుదేవుని క్షమాపణ కోరాడు.
పరమ శివుడు హనుమంతుని చిరంజీవిగా దీవించి వాయుదేవుని సంతృప్తి పరచాడు. వాయుదేవుడు అప్పుడు గుహనుండి బయటకు వచ్చి సమస్త ప్రాణికోటినీ రక్షించాడు.
Related Posts:
Sri Hanuman Badabanala Stotram – శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం
Sri Hanuman Langoolastra Stotram – శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం
కోరికలు తీర్చే కొండగట్టు హనుమాన్ ? | Hanuman Fillfulls Desire in Telugu.
హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది? | Hanuman Sindhuram in Telugu
Hanuman Jayanti 2025 | Hanuman Jayanthi Celebrated by Telugu People
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa – Telugu
Hanuman Jayanti 2025 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి
Facts about Hanuman Marriage | హనుమంతునికి వివాహం జరిగిందా? | Hanuman
so many adhyathmika, purana and bhakthi articles I came to know through our hariome .