
How is the Dussehra Festival Decided?
1దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు ?
ప్రతి సంవత్సరము శరదృతువు లో అశ్వియుజ శుద్ద పాడ్యమి నుండి దశమి వరకు గల సమయమును దసరా లేదా దేవి నవరాత్రులుగా పండితులు నిర్ణయించడము జరుగుతుంది .శరదృతువులో వస్తుంది కాబట్టి దేవి శరన్నవరాత్రులు అని కూడా సంబోదించడము జరుగుతుంది .
అంతే కాకుండా శరన్నవరాత్రులను ఆయా సమయాలలో వచ్చే తిధులయోక్క వృద్ది క్షయాలను అనుసరించి సాదారణంగా 9 రోజులు గాను, కొన్ని సమయాలలో 10 రోజులుగాను, మరి కొన్ని సమయాలలో 11 రోజులుగాను పండితులు నిర్ణయించడము జరుగుతుంది.
పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? (What is the Method of Celebrating the Desara?)
ఈ శరన్నవరాత్రులలో సాదారణం గా అమ్మవారిని ఒక్కో తిధి రోజు ఒక్కో రూపముతో అలంకరించి పూజించడం జరుగుతుంది. అలాగే అమ్మవారు ఒక్కో రూపములో ఉన్న సమయములో ఒక్కో రకమైన నైవేధ్యమును సమర్పించే సాంప్రదాయము కూడా ఉంది.
ఆయా తిధులలో అమ్మవారి ఆయా రూపాలు, సమర్పించవలసిన నైవేధ్యములు వరుసగా………
03-10-2024
- గురువారము, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
- శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి
- పసుపుచీర
- నివేదన: పంచదార, దధ్యన్నము
04-10-2024
- శుక్రవారము, ఆశ్వయుజ శుద్ధ విదియ,
- శ్రీ గాయత్రీ దేవి
- గులాబిచీర
- నివేదన: పాలతో నైవేద్యం, గుడాన్నం
05-10-2024
- శనివారము, ఆశ్వయుజ శుద్ధ తదియ
- శ్రీ అన్నపూర్ణ దేవి
- గోధుమ రంగు చీర
- నైవేద్యం: అప్పాలు, నేతి అన్నం
06-10-2024
- ఆదివారము, ఆశ్వయుజ శుద్ధ సప్తమి
- శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఆకుపచ్చ చీర
- నైవేద్యం: తేనే, పులిహోర
07-10-2024
- సోమవారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి
- శ్రీ మహా చండీ దేవి
08-10-2024
- మంగళవారము, ఆశ్వయుజ శుద్ధ చవితి
- శ్రీ మహాలక్ష్మీ దేవి
- చిలుకపచ్చ చీర
- నైవేద్యం: బెల్లం, పాయసం
09-10-2024
- బుధవారము, ఆశ్వీయుజ శుద్ద షష్ఠి (మూలా నక్షత్రం)
- శ్రీ సరస్వతీ దేవి
- తెలుపు రంగు చీర
- నైవేద్యం: జీడిపప్పు
10-10-2024
- గురువారము, ఆశ్వయుజ శుద్ధ అష్టమి
- శ్రీ దుర్గా దేవి
- ఎరుపు చీర
- నైవేద్యం: పేలాలు పాయసం
11-10-2024
- శుక్రవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి
- శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
- బూడిదరంగు చీర
- నైవేద్యం: నువ్వులు
12-10-2024
- శనివారము, ఆశ్వయుజ శుద్ధ దశమి
- శ్రీ రాజరాజేశ్వరీ దేవి
- అనేక వర్ణాలు కలిగినచీర
- అన్నిరకముల నైవేద్యాలు పండ్లు నివేదన చేయవచ్చును
ఈ విధముగా అమ్మవారిని ఆయా తిధి, నక్షత్రాలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో రూపములో అలంకరించి పూజించడము జరుగుతుంది. అయితే మొదటి రోజు మాత్రము ఏ దేవాలములో ఏ అమ్మ వారు అయితే ఉంటారో ఆ అమ్మవారిని అదే రూపములో అలంకరించి పూజించడము జరుగుతుంది. ఉదాహరణకు దుర్గా అమ్మవారి గుడిలో అమ్మవారిని మొదటి రోజు దుర్గా అలంకారముతోనే పూజిస్తారు, అలాగే గాయత్రి దేవి దేవాలయములో అమ్మవారిని మొదటి రోజు గాయత్రి రూపములోనే అలంకరించి పూజించడము జరుగుతుంది.
అదే విధముగా గృహములలో అయితే ఎవరి కుల/వంశ/అనుస్టాన దేవతను వారు మొదటి రోజు అదే రూపములో అలంకరించి, భావన చేసి పూజించడము జరుగుతుంది.
అయితే ఆయా అమ్మవారి రూపములను ఆ విధముగానే ఎందుకు అలంకరిస్తారు. నైవేధ్యముగా వాటినే ఎందుకు సమర్పిస్తారు, మన దైనందిన జీవితములో మనం నిత్యం ఎదుర్కొనే సమస్యల విముక్తికి అమ్మవారిని ఏ విధముగా పూజించాలి ..,అనేది మరో పోస్టు లో తెలుసుకుందాము.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Navaratri Durga Puja Related Posts
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా సమయంలో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/