
Why Should We take Theertham 3 times in Telugu – తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు ఐతే పూజ చేసే సమయం లో లేదా దేవాలయం లో దర్శనం తరువాత మూడు సార్లు తీర్ధం తీసుకొంటాము . ఇందులో అంతరార్దం చూద్దాము.
మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం
రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు
మూడవది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి.
తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వుటాయి. అందుకే తీర్ధం
అత్యంత పవిత్రమైనది . ఆరోగ్యాన్నీ,ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుంది .
మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు. తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో, ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యాన్నీ, నా ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుందనే సద్భావంతో తీసుకోవాలి
తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు “అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం… పాదోదకం పావనం శుభం” అంటూ తీర్ధం ఇస్తారు.
తీర్ధం సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి దేవాలయం లో తప్పనిసరిగా తీర్ధం తీసుకోండి . భగవంతుడి కృప కు పాత్రులు అవ్వండి.
” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం “.
మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.
ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com