పూజలో గంట ఎందుకు మోగిస్తారు? | Why to Ring Bell During Rituals?

1
14503

 

why-do-we-ring-bells-during-rituals
Why Do We Ring Bells During Rituals

Ring Bell During Rituals

1. పూజలో గంట ఎందుకు మోగిస్తారు

భగవంతునికి ఆహ్వానం పలకడానికి గంట మోగిస్తారు. మనం చేసే ఉపచారాలకు స్వామిని లేదా అమ్మవారిని  అభిముఖం చేసే ప్రయత్నమే ఘంటారావం. దేవాలయం లోకి ప్రవేశించగానే ముందు ఘంటారావం చేసి భగవంతుని దర్శించుకునేది కూడా ఇదే కారణం తో. అంతే కాకుండా చుట్టూ ఉన్న దుష్ట శక్తులకూ, భూత పిశాచాలకూ భగవంతుని పూజ మొదలైందనీ, ఇంక ఆ చోట వాటికి స్థానం లేదనీ హెచ్చరిక గా గంట వాయిస్తారు.  శక్తి కొద్దీ ఆర్భాటంగా ఖరీదైన లోహాలతో చేసిన గంటలను చూస్తుంటాం. కానీ ‘కంచు మ్రోగునట్లు కనకంబుమ్రోగునా’ అన్న నానుడి ఈ విషయం లో వర్తిస్తుంది. భగవంతుడికి కంచు గంట శ్రేష్ఠం.

ఏ దేవునికి ఎటువంటి గంటను ఉపయోగించాలి?

శివునికైతే నంది గంట (నంది ఆకారం చెక్కబడిన గంట), విష్ణువుకైతే ఆంజనేయుడు లేదా గరుత్మంతుడు చెక్కబడిన గంటలు ఉపయోగించాలి.వినాయకుడు, శృంగి,  శంఖ చక్రాదులు ఇలా రకరకాలైన స్వరూపాలు గల గంటలు అందుబాటులో ఉన్నాయి. రోజువారీగా ఇంట్లో పూజించేటప్పుడు ఈ భేదం పాటించాల్సిన అవసరం లేదు.  “శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చహృదయం శివః” అన్నారుకదా..!!  ఇక అమ్మవారికి అందరూ బంటులే కదా..కనుక యే రూపం గల గంటనైనా వాడవచ్చు.

Related Stories

Gopashtami | కోరికలు నెరవేర్చే గోమాత పూజా విధానం, విశిష్టత

Sheetala Saptami 2025 | శీతల సప్తమి తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం

Krishna janmashtami 2025 | శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత & పూజా విధానం

Atla Taddi | అట్ల తద్ది పండగ సాంప్రదాయం, విశిష్టత, వ్రతకథ, పూజా విధానం

Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.

Hanuman Jayanti 2025 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి

Magha Pournima | మాఘ పూర్ణిమ పూజ సమయం, మరియు ప్రాముఖ్యత

 

Promoted Content

1 COMMENT

  1. మంచి విషయం తెలిపినందులకు ధన్యవాదములతో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here