Saphala Ekadashi 2026 | సఫల ఏకాదశి 2026 విశిష్ఠత, కథ, శుభ సమయం & పూజా విధానం

0
2727
Saphala Ekadashi Story, Puja Vidh, Fasting Rules & Significance
What are the Saphala Ekadashi Story, Puja Vidh, Fasting Rules & Significance?!

Saphala Ekadashi Importance

1సఫల ఏకాదశి ప్రాముఖ్యత

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

హిందూ గ్రంధాలలో అనుసరించి మొత్తం 24 ఏకాదశిలు ఉన్నాయి. అందులో సఫల ఏకాదశి ఒకటి. మన హిందూ మతంలో ఏకాదశి రోజు చేసే ఉపవాసం వలన చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. తపస్సు, యాగం, పవిత్ర నది స్నానం చేయడం కన్నా కూడా ఈ ఉపవాసం ఉండడం వలన కలిగే పుణ్యం చాలా గొప్పదని నమ్ముతారు. సఫల ఏకాదశి రోజున హిందువులు నిష్టగా ఉపవాసం చేయడం వలన భక్తులు వారి యొక్క పాపాలను పోగొట్టుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు. సఫల ఏకాదశి లోక రక్షకుడైన విష్ణువు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున భక్తులు అందరూ విష్ణువు ఆరాధిస్తారు. సఫల అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని, ఆనందాన్ని పొందాలి అనుకున్న వారు ఈ ఏకాదశిని ఆచరించాలి. ఈ సంవత్సరం 2026 నవంబర్ 12న  జరుపుకుంటారు. అయితే సఫల ఏకాదశి వ్రత కథ, శుభ ముహూర్తం, పారణ సమయం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం.

సఫల ఏకాదశి వ్రతం యొక్క కథ (A Story & Rules of a Saphala Ekadashi Fasting):

చంపావతి అనే రాజ్యాన్ని మహిష్మత్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు 5 కుమారులు. ఆ 5గురు కుమారులలో రాజు పెద్ద కుమారుడు ధైర్యవంతుడు, అలాగె దుర్మార్గుడు కూడా అతని ప్రవర్తన మంచిగా ఉండేది కాదు. రాజు మరియు మిగిలిన కుమారులు రాజు పెద్ద కుమారుడికి లుంభక్ అని పేరు పెట్టారు. కొంత కాలం తరువాత, లుంభక్ యొక్క ప్రవర్తన చాలా రాక్షసంగా మారింది. ఒకరోజు రాజు పెద్ద కూమారుడు లుంభక్ దొంగతనానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజు యొక్క భటులు అతన్ని పట్టుకుంటారు. అప్పుడు రాజు గారు అతన్ని రాజ్యం నుంచి పంపించేస్తారు. లంభక్ అడవిలో ఒక మర్రి చెట్టు కింద నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో లుంభాక్ తన యొక్క అలవాట్లు తన జీవితాన్ని ఎలా నాశనం చేశాయో భాదపడుతూ, పాపాలు చేసినందుకు పశ్చాత్తాప పడ్డాడు. అనుకోకుండా ఏకాదశి తిథి రోజున, అతను ఒక చెట్టు కొన్ని పండ్లను తీసుకువచ్చి విష్ణువుకు సమర్పించాడు. అతనికి అవరు అఆహారం పెట్టెవారిన్ లేరు కాబట్టి రోజంతా ఆహారం తీసుకోలేదు. అతను తనకి తెలియకుండానే ఏకాదశి ఉపవాస చేసాడు, వ్రతాన్ని పాటించడం ముగించాడు. అలా లుంభక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రాజుగారు లుంభక్ యొక్క పరివర్తన గురించి తెలుసుకుని తిరిగి రాజు గారు అతనిని తన వారసుడిగా ఒప్పుకున్నాడు. అలా లుంభక్ ఏకాదశి తిథి రోజున తనకు తెలియకుండా వ్రతం ఆచరించి గొప్ప ఫలితాన్ని పొందాడు.

సఫల ఏకాదశి 2026 తిథి, శుభ సమయం (Safala Ekadashi 2026 Tithi, Auspicious Time):

సఫల ఏకాదశి సోమవారం, నవంబర్ 12, -2026
నవంబర్ 13న, పరానా సమయం – 06:56 AM నుండి 08:54 AM వరకు
పారణ దినం ద్వాదశి ముగింపు క్షణంలో – 09:47 PM
ఏకాదశి తిథి ప్రారంభం – నవంబర్ 11, -2026న 08:41 PM
ఏకాదశి తిథి ముగుస్తుంది – నవంబర్ 12, -2026న 08:59 PM

సఫల ఏకాదశి పూజా విధానం (Saphala Ekadashi Puja Vidh):

1. ఏకాదశి వ్రతం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది.
2. ఏకాదశి రోజున వేకువగామున నిద్రలేచి, ముందుగా స్నానం ఆచారించాలి.
3. తరువాత ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి, ఉపవాసం మొదలుపెట్టాలి.
4. ఇంట్లో గంగాజలం చల్లి విష్ణువును పూజ చేయాలి.
5. పూలు, తులసి ఆకులు, అగరుబత్తీలు, పండ్లు విష్ణువుకు సమర్పిచాలి.
6. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని జపించండి.
7. రాత్రి నిస్ర పొఖుండ నారాయణుని స్తోత్రాలను జపించండి.
8. తరువాత రోజున స్నానం చేసి బ్రాహ్మణునికి ఆహారం పెట్టండి.
9. వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఉపవాసం విరమించండి.
10. ఉపవాసం సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి.

సఫల ఏకాదశి ప్రాముఖ్యత (Saphala Ekadashi Significance) :

1. సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు, యుధిష్ఠిరునికి వివరించారు.
2. శ్రీకృష్ణుడు నేను సఫల ఏకాదశి వ్రతం నుంచి పొందేంత సంతృప్తిని పెద్ద యాగాల నుండి కూడా పొందలేదు అని ఈ ఉపవాసం గురించి వివరించారు.
3. ఈ ఉపవాసం చేసిన వారు అన్ని పనులలో విజయాన్ని లభిస్తుంది.
4. గొప్ప పుణ్యం మరియు శుభం జరుగుతుంది.
5. రాత్రిపూట నిద్రపోకుండ భజన, కీర్తనలు చేసే భక్తులకు ఉత్తమమైన ఫలం లభిస్తుంది.
6. ఈ వ్రతం చేసిన వారు సుఖాన్ని అనుభవించి మరణానంతరం విష్ణు లోకానికి వెళ్తారు.

Related Stories

Mohini Ekadashi 2025 | మోహినీ ఏకాదశి 2025 విశిష్ఠత, కథ, శుభ సమయం & పూజా విధానం.

Ekadashi Story | ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ఒక దేవత అని తెలుసా? ప్రాముఖ్యత, విశిష్ఠత, పూజ విధానం, ఉపవాస నియమాలు ఏమిటి?

Complete List of Ekadashi 2025 | ఏకాదశి 2025 తేదీల జాబితా, ఏ ఏకాదశి ఎప్పుడు?

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు