
Sankashtahara Chaturthi (Sankashti Chaturthi) in Telugu
1సంకష్టహర చతుర్థి
Significance of Sankashtahara Chaturdi
సంకష్టహర చతుర్థి దక్షిణాయనంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి కనుక ఈ రోజు విఘ్నేశ్వరుని ప్రీతికై సంకష్టహర చతుర్టీవ్రతాన్ని ఆచరించడం ఉత్తమం.
అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి? (What is Sankashtahara Chaturthi Vrat)
గణేశ పురాణం ప్రకారం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధి చతుర్థి. ఇది రెండు రకాలుగా ఆచరించబడుతుంది:
- వరద గణపతి పూజ
- సంకష్టహర గణపతి
వరద చతుర్థి పూజ:
వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే ‘వినాయక చవితి’. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.
సంకష్టహర గణపతి:
సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం.
సంకష్టహర చతుర్థి వ్రత కథ (Sankashtahara Chaturthi Vrat Katha)
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.
సంకష్టహర చతుర్థి నియమాలు (Sankashti Chaturthi Rules)
- కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థినే గ్రహించాలి.
- ఈ వ్రతం సంకల్పించిన రోజు శ్రావణ బహుళ చవితి తెల్లవారు ఝామునే నిద్రలేచి, గణపతిని ప్రార్డించి, స్నానాది అనుష్టానాలు పూర్తి చేసుకుని 108 సారు గణపతిని స్మరించడం, స్తోత్రాదులు పారాయణ చేయడం విధి.
- సర్వ ఉపద్రవాలు, దీర్ఘవ్యాధులు, భయ, మిధ్యాపవాద దోషాలు, నానా కష్టాలు ఉపశమించడానికై వినయక ప్రీత్యర్ధం ఈ వ్రతం ఛెయువారికి, వారి కామితార్ధం సత్వర ఫల ప్రాప్తి నందగలదు.
- పూజ చేయురోజున పగటిపూట ఉపవాసం వుండాలి.
- సాయంకాలం షోడశోపచార సహితంగా వేయు నామాలతో గణపతిని పూజించి మోదక, గుడ (బెల్లం) నివేదనల్లో పాటు ముఖ్యంగా 21 సంఖ్యలో ఉండ్రాళ్లు నివేదించాలి.
- వినాయకుని పూజించేటప్పడు బిల్వ పత్రాలు తెల్లజిల్లేడు పువ్వులు, గరికపోచలు శ్రేష్టం.
- సంవత్సరం పూర్తయిన తర్వాత వాయనదానం, ఉద్యాపన ముఖ్యం.
- యథాశక్తి లేదా 108 సార్లు ఓం గణపతియే నమః అనే అష్టాక్షరీ మంత్రజపం పూజ సమయంలో విశేవ ఫలదాయకం.
- వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించవచ్చు. సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చతుర్థి నాడు వ్రతాన్ని ప్రారంభిస్తారు.
సంకష్టహర చతుర్థి సంకల్పం
మమ సకుటుంబన్య ఇహజన్మని జన్మాంతరే చ సంభూతానాం దురితానం క్షయ ద్వారా – శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం అపిచ మమ విద్యా పత్ర పౌత్ర ప్రాష్ట్యర్ధం – సకల దురిత సంకష్ట నివారణ సిద్ధ్యర్ధం శ్రీ గణపతి దేవతా ప్రత్యర్ధం సంకష్ట హర చతుర్టీ వ్రత మహా కరిష్యే II అని ప్రారంభించాలి.
సంకటహర చతుర్థి వ్రతం ద్వారా లాభాలు:
- సంకటముల తొలగింపు:
సంకటాలు తొలగి శుభకార్యాలు జరగడం. - ఆధ్యాత్మిక శాంతి:
వినాయకుని ఆశీర్వాదంతో మనశ్శాంతి లభిస్తుంది. - కుటుంబ శ్రేయస్సు:
కుటుంబంలో ఆనందం, ఐక్యత కలుగుతుంది.
మహత్యం:
వ్రతం ఆచరించేవారు గణేశుడి లోకానికి చేరతారని, ఆయన ఆశీస్సులతో జీవితంలో శ్రేయస్సు పొందుతారని విశ్వాసం.
Sankashtahara Chaturthi 2026 Dates
| తేది | వేడుక పేరు | ప్రారంభ సమయం | ముగింపు సమయం |
| 06-01-2026 (మంగళవారం) | సంకటహర చతుర్థి (లంబోదర) | రాత్రి 09:06 | ఉదయం 06:52 (07 జన) |
| 05-02-2026 (గురువారం) | సంకటహర చతుర్థి (ద్విజప్రియ) | రాత్రి 09:25 | రాత్రి 12:22 (06 ఫిబ్ర) |
| 06-03-2026 (శుక్రవారం) | సంకటహర చతుర్థి (భాలచంద్ర) | రాత్రి 08:52 |
సాయంత్రం 07:17 (07 మార్చి)
|
| 05-04-2026 (ఆదివారం) | సంకటహర చతుర్థి (వికట) | రాత్రి 09:16 |
మధ్యాహ్నం 02:10 (06 ఏప్రిల్)
|
| 05-05-2026 (మంగళవారం) | సంకటహర చతుర్థి (ఏకదంత) | రాత్రి 09:46 | ఉదయం 07:51 (06 మే) |
| 04-06-2026 (గురువారం) | సంకటహర చతుర్థి (విభువన) | రాత్రి 10:04 | రాత్రి 11:30 |
| 03-07-2026 (శుక్రవారం) | సంకటహర చతుర్థి (కృష్ణపింగళ) | రాత్రి 09:24 |
మధ్యాహ్నం 12:39 (04 జూలై)
|
| 02-08-2026 (ఆదివారం) | సంకటహర చతుర్థి (గజానన) | రాత్రి 09:17 | రాత్రి 11:15 |
| 31-08-2026 (సోమవారం) | సంకటహర చతుర్థి (హేరంబ) | రాత్రి 08:35 |
ఉదయం 07:41 (01 సెప్టెంబర్)
|
| 29-09-2026 (మంగళవారం) | సంకటహర చతుర్థి (విఘ్నరాజ) | రాత్రి 08:02 |
మధ్యాహ్నం 02:55 (30 సెప్టెంబర్)
|
| 29-10-2026 (గురువారం) | సంకటహర చతుర్థి (వక్రతుండ) | రాత్రి 08:46 | రాత్రి 10:09 |
| 27-11-2026 (శుక్రవారం) | సంకటహర చతుర్థి (గణాధిప) | రాత్రి 08:43 |
ఉదయం 06:39 (28 నవంబర్)
|
| 26-12-2026 (శనివారం) | సంకటహర చతుర్థి (అఖూరథ) | రాత్రి 08:33 |
సాయంత్రం 05:12 (27 డిసెంబర్)
|
Related Posts
Sankashtahara Chaturdi 2024 Dates, Puja Vidhi, Rituals, Significance & Fasting Rules
Sankatahara Chaturthi Puja Vidhanam in Telugu | సంకటహర చతుర్థీ పూజా విధానం
Sankata Nashana Ganesha Stotram (Deva Krutam) in Telugu | సంకటనాశన గణేశ స్తోత్రం (దేవ కృతం)
Daridra Dahana Ganapathy Stotram in Telugu | దారిద్ర్య దహన గణపతి స్తోత్రం
Sri Maha Ganapati Sahasranamavali in Telugu | శ్రీ మహాగణపతి సహస్రనామావళిః
Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram in Telugu | శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం
Sri Haridra Ganapati Puja in Telugu | శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ)







ఇప్పుడు ప్రతి రోజూ ఉదయమే హరీఓం మెసేజ్ చూడడం వల్ల అదే రోజు చేయవలసిన పూజాది కార్యక్రమములు చేయడానికి అవకాశం ఉంటుంది. (ఇంతకముందు ఒకో సారి సాయంత్రం లేదా రాత్రిపూట వచ్చెది. దానివల్ల ఆరోజు ప్రాముఖ్యతను తెలుసుకొని పాటించ దానికి అవకాశం ఉండేదికాదు)
చాలా బాగుందండి, ఉదయమే పంచాంగం తెలిసిపోతే, ఆ అనుభవమే వేరు.
Early morning when I see the message it gives very positive energy
Hari ome
Repati pramukyatani one day advance ga cheppinatlyte patinchadaniki enka baguntundemo think once.
Am very much satistified with the spiritual messages of Hariome.com
Good postings. CONTINUE.
Inform previous day so can perform the auspicious day well manner. Please gIve
daily rasiphalalu very nice to see
Hari ome messages thank you.
Hariome
Your messages are very helpful
Thankyou very much
Vinayakudi bakthudni…
maatho share chesinanduku chala krutagnathalu.. 🙂
Good posting its very useful to everyone
Good posting its very useful to every one am very happy
Tq use ful information 🙏🏻