Ratha Saptami 2027 Date & Time | రథసప్తమి విశిష్టత, పూజ విధానం & ముఖ్య నియమములు

0
46801
Ratha Saptami in Telugu
Ratha Saptami 2027 | రథసప్తమి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Ratha Saptami 2027

Back

1. రథసప్తమి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు?

రథ సప్తమి విశేషత (Ratha Saptami Significance)

మాఘ మాసం లోని ఏడవరోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండీ మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం లో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భం లో ఆ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథ సప్తమికే సూర్య జయంతి, భాను సప్తమి, మిత్ర సప్తమి, జయ సప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమీ అని ఎన్నో పేర్లు ఉన్నాయి. రథ సప్తమి సూర్య భగవానుని జన్మదినం. ఈ రథ సప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడు. ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు/ కిరణాలు ఈ రోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు కాంభోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమీ వ్రతాన్ని ఆచరించి సూర్య భగవానుని అనుగ్రహం తో తన కుమారుని అనారోగ్యం నుంచీ కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది.

రథ సప్తమి ప్రత్యేక స్నానం:

రథసప్తమినాడు తెల్లవారుఝామునే తలంటుకుని స్నానం చేయడం వలన అనేక రోగాలు నయమౌతాయి. స్నాన సమయం లో పీటపై లేదా ఆసనం పై కూర్చుని సూర్య శక్తికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులను (మూడు/ఐదు/ఏడు ఆకులు) వాటిపైన కొన్ని అక్షతలను, రేగు పళ్ళను ఉంచి తలపైన, రెండు భుజాలపైనా, తొడల పైన, మోకాళ్ళ పైనా పెట్టుకుని.

రథ సప్తమి రోజు పఠించాల్సిన స్తోత్రం (Hymn to be Recited on Ratha Saptami Day)

శ్లో. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా |

సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ ||

శ్లో. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కాయజమ్ యచ్చత్ జ్ఞాతా జ్ఞాతేచ్చ ఏ పునః

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే

సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ||

అనే ఈ శ్లోకాలను చదువుకోవాలి. ఇలా చేస్తే మనసా, వాచా, కర్మణా చేసిన పాపాలు,జన్మ జన్మాంతర పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు (ఏడు రకాల పాపాలు) తొలగుతాయి . ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

అర్ఘ్యం

స్నానానంతరం పరిశుభ్రమైన రాగిపాత్రలో నీటిని తీసుకుని అందులో కుంకుమతో కలిపిన అక్షతలు, ఎర్రని పూలు,ఎర్ర చందనం / రక్త చందనం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ అర్ఘ్యం సమర్పించాలి లేదా అర్ఘ్యాన్ని సమర్పించే సమయం లో ఈ శ్లోకాన్ని చదవాలి.

శ్లో. సప్త సప్తి వహప్రీతా సప్తలోక ప్రదీపనా

సప్తమీ సహితొదేవా గృహాణర్ఘ్యం దివాకరా |

రథ సప్తమి రోజు చేయవలసిన నైవేద్యం (Prasadam Offering on Ratha Saptami)

రథ సప్తమినాడు ఆవుపేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికెదురుగా పొయ్యిని తయారు చేసుకుని, మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవుపాలను కాచాలి. పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం, చక్కెర లేదా బెల్లము వేసి పాయసం చేయాలి. చిక్కుడు కాయలతో వంటకాన్ని చేయాలి. వీటిని చిక్కుడు ఆకులలో సూర్యభగవానునికి నివేదించాలి. పీడకల పొయ్యిని తయారు చేసుకోలేనివారు మామూలుగా పాయసాన్ని, చిక్కుడు కాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి.

Ratha Saptami 2027 Date & Timings

2027వ సంవత్సరంలో రథ సప్తమి (మాఘ శుద్ధ సప్తమి) ఫిబ్రవరి 12, శుక్రవారం నాడు జరుపుకుంటారు. సూర్య జయంతిగా భావించే ఈ పవిత్రమైన రోజున సూర్య భగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.

తిధి ప్రారంభం: 2027-ఫిబ్రవరి-13న ఉదయం 02:59 గంటలకు ప్రారంభమవుతుంది.
తిధి ముగింపు:  2027-ఫిబ్రవరి-14న ఉదయం 02:07 గంటలకు ముగుస్తుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here