ఈ రోజు – రథసప్తమి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Ratha Saptami in Telugu

0
32770

Ratha Saptami in Telugu

Back

1. రథ సప్తమి విశేషత

మాఘ మాసం లోని ఏడవరోజు అంటే మాఘ శుక్ల సప్తమినాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండీ మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం లో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భం లో ఆ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది. రథ సప్తమికే సూర్య జయంతి, భాను సప్తమి, మిత్ర సప్తమి, జయ సప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమీ అని ఎన్నో పేర్లు ఉన్నాయి. రథ సప్తమి సూర్య భగవానుని జన్మదినం. ఈ రథ సప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడు. ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు/ కిరణాలు ఈ రోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు కాంభోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమీ వ్రతాన్ని ఆచరించి సూర్య భగవానుని అనుగ్రహం తో తన కుమారుని అనారోగ్యం నుంచీ కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here