Pradosha Kalam In Telugu | ప్రదోష వేళ అంటే ఏమిటి?

1
78120
Pradosha Kalam
What is Pradosha Kalam / Time?

What is Pardosha Kalam?

ప్రదోష కాలం అంటే ఏమిటి?

ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతి రోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి, మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును.

ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగును. అటులే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదహైదు ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగును. అటులే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగును. అటులే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఈ త్రయోదశీ ప్రదోషము అవధిని ఇలాగ లెక్క కట్టెదరు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ, తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. (ఒక ఘడియ = 24 నిమిషాలు) ఈ ప్రదోష దినము అనధ్యయనము. సర్వ విద్యలకూ గర్హితమైనది. సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది. ఆ సమయములో ప్రదోషమైనచో, కొన్ని అనుష్ఠానములు చేయ వలెను. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు, కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అనునది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వచ్చును. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాస శివరాత్రి వచ్చును. దాని వెనుకటి రోజు త్రయోదశిలో మహా ప్రదోష కాల శివ పూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత గలదు. ఆ రోజు కూడా శివ పూజనే చేయవలెను. ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజూ ఎన్నో పాప కర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయవలెను. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథ గణాలతో కొలువై మన పూజలు అందుకొనుటకు సిద్ధంగా ఉండు సమయమది. మన పాప కర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి, మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును. ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి యనీ, సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక, గురువారము నాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము గలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా, ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి. శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకము లోని శని ప్రభావము కూడా తొలగింపబడును. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడితడు. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును. సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగును. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాప హరము, సర్వ పుణ్యదము. ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు, మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే.

ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు, పొంగిపోతాడు, భోళా శంకరుడు.

Post Copied from (Source of Content) : Janardhana Sharma

Pradosham 2025 Dates

తేదీ ప్రదోష వ్రతం తిథి ప్రారంభ సమయం ప్రారంభ తేదీ ముగింపు సమయం ముగింపు తేదీ
2025 జనవరి 11, శనివారం శని ప్రదోష వ్రతం పౌష శుక్ల త్రయోదశి ఉదయం 08:21 జనవరి 11 ఉదయం 06:33 జనవరి 12
2025 జనవరి 27, సోమవారం సోమ ప్రదోష వ్రతం మాఘ కృష్ణ త్రయోదశి రాత్రి 08:54 జనవరి 26 రాత్రి 08:34 జనవరి 27
2025 ఫిబ్రవరి 9, ఆదివారం రవి ప్రదోష వ్రతం మాఘ శుక్ల త్రయోదశి సాయంత్రం 07:25 ఫిబ్రవరి 9 సాయంత్రం 06:57 ఫిబ్రవరి 10
2025 ఫిబ్రవరి 25, మంగళవారం భౌమ ప్రదోష వ్రతం ఫాల్గుణ కృష్ణ త్రయోదశి మధ్యాహ్నం 12:47 ఫిబ్రవరి 25 ఉదయం 11:08 ఫిబ్రవరి 26
2025 మార్చి 11, మంగళవారం భౌమ ప్రదోష వ్రతం ఫాల్గుణ శుక్ల త్రయోదశి ఉదయం 08:13 మార్చి 11 ఉదయం 09:11 మార్చి 12
2025 మార్చి 27, గురువారం గురు ప్రదోష వ్రతం చైత్ర కృష్ణ త్రయోదశి రాత్రి 01:42 మార్చి 27 రాత్రి 11:03 మార్చి 27
2025 ఏప్రిల్ 10, గురువారం గురు ప్రదోష వ్రతం చైత్ర శుక్ల త్రయోదశి రాత్రి 10:55 ఏప్రిల్ 9 ఉదయం 01:00 ఏప్రిల్ 11
2025 ఏప్రిల్ 25, శుక్రవారం శుక్ర ప్రదోష వ్రతం వైశాఖ కృష్ణ త్రయోదశి మధ్యాహ్నం 11:44 ఏప్రిల్ 25 ఉదయం 08:27 ఏప్రిల్ 26
2025 మే 9, శుక్రవారం శుక్ర ప్రదోష వ్రతం వైశాఖ శుక్ల త్రయోదశి మధ్యాహ్నం 02:56 మే 9 సాయంత్రం 05:29 మే 10
2025 మే 24, శనివారం శని ప్రదోష వ్రతం జ్యేష్ఠ కృష్ణ త్రయోదశి సాయంత్రం 07:20 మే 24 మధ్యాహ్నం 03:51 మే 25
2025 జూన్ 8, ఆదివారం రవి ప్రదోష వ్రతం జ్యేష్ఠ శుక్ల త్రయోదశి ఉదయం 07:17 జూన్ 8 ఉదయం 09:35 జూన్ 9
2025 జూన్ 23, సోమవారం సోమ ప్రదోష వ్రతం ఆషాఢ కృష్ణ త్రయోదశి తెల్లవారుజామున 01:21 జూన్ 23 రాత్రి 10:09 జూన్ 23
2025 జూలై 8, మంగళవారం భౌమ ప్రదోష వ్రతం ఆషాఢ శుక్ల త్రయోదశి రాత్రి 11:10 జూలై 7 రాత్రి 12:38 జూలై 9
2025 జూలై 22, మంగళవారం భౌమ ప్రదోష వ్రతం శ్రావణ కృష్ణ త్రయోదశి ఉదయం 07:05 జూలై 22 ఉదయం 04:39 జూలై 23
2025 ఆగస్టు 6, బుధవారం బుధ ప్రదోష వ్రతం శ్రావణ శుక్ల త్రయోదశి మధ్యాహ్నం 02:08 ఆగస్టు 6 మధ్యాహ్నం 02:27 ఆగస్టు 7
2025 ఆగస్టు 20, బుధవారం బుధ ప్రదోష వ్రతం భాద్రపద కృష్ణ త్రయోదశి మధ్యాహ్నం 01:58 ఆగస్టు 20 మధ్యాహ్నం 12:44 ఆగస్టు 21
2025 సెప్టెంబర్ 5, శుక్రవారం శుక్ర ప్రదోష వ్రతం భాద్రపద శుక్ల త్రయోదశి తెల్లవారుజామున 04:08 సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 03:12 సెప్టెంబర్ 6
2025 సెప్టెంబర్ 19, శుక్రవారం శుక్ర ప్రదోష వ్రతం ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి రాత్రి 11:24 సెప్టెంబర్ 18 రాత్రి 11:36 సెప్టెంబర్ 19
2025 అక్టోబర్ 4, శనివారం శని ప్రదోష వ్రతం ఆశ్వయుజ శుక్ల త్రయోదశి సాయంత్రం 05:09 అక్టోబర్ 4 మధ్యాహ్నం 03:03 అక్టోబర్ 5
2025 అక్టోబర్ 18, శనివారం శని ప్రదోష వ్రతం కార్తీక కృష్ణ త్రయోదశి మధ్యాహ్నం 12:18 అక్టోబర్ 18 మధ్యాహ్నం 01:51 అక్టోబర్ 19
2025 నవంబర్ 3, సోమవారం సోమ ప్రదోష వ్రతం కార్తీక శుక్ల త్రయోదశి తెల్లవారుజామున 05:07 నవంబర్ 3 తెల్లవారుజామున 02:05 నవంబర్ 4
2025 నవంబర్ 17, సోమవారం సోమ ప్రదోష వ్రతం మార్గశిర కృష్ణ త్రయోదశి తెల్లవారుజామున 04:47 నవంబర్ 17 ఉదయం 07:12 నవంబర్ 18
2025 డిసెంబర్ 2, మంగళవారం భౌమ ప్రదోష వ్రతం మార్గశిర శుక్ల త్రయోదశి మధ్యాహ్నం 03:57 డిసెంబర్ 2 మధ్యాహ్నం 12:25 డిసెంబర్ 3
2025 డిసెంబర్ 17, బుధవారం బుధ ప్రదోష వ్రతం పౌష కృష్ణ త్రయోదశి రాత్రి 11:57 డిసెంబర్ 16 తెల్లవారుజామున 02:32 డిసెంబర్ 18

 

 

Related Posts

Pradosha Pooja & Vrath 2025 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

Gita Jayanti 2025 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?

వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ

Pradosha Pooja & Vrath 2025 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర

Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

Sankashtahara Chaturthi 2025 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here