
On Janmashtami Buy These Items Then Your Financial Situation Will Improve
1జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు
కృష్ణాష్టమి రోజున ఈ 5 వస్తువులు కొనుగోలు చేయండి ..దాని ప్రాభవం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా కృష్ణాష్టమి పండుగను హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంప్రదాయం మన హిందూ ధర్మంలో చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున జరుపుకుంటారు.ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 16, 2024, శనివారం రోజున జరుపుకుంటారు. ఈ రోజున ఏ వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారో తెలియజేస్తున్నారు మన వేద పండితులు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఏమి కొనాలి? (What to Buy on Sri Krishna Janmashtami?)
- వెన్న ప్రేమ: శ్రీకృష్ణుడు తన బాల్యంలో వెన్నను ఎంతగా ఇష్టపడేవాడో తెలిసిందే. ఆయన వెన్న కోసం అల్లరి చేసేవాడు.
- వెన్న సమర్పణ: కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి వెన్నను సమర్పించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు.
- పిల్లనగ్రోవి: శ్రీకృష్ణుడికి పిల్లనగ్రోవి లేకుండా ఊహించలేము. కృష్ణాష్టమి రోజున పిల్లనగ్రోవిని సమర్పించడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- నెమలి ఈకలు: శ్రీకృష్ణుడి కిరీటంపై ఉన్న నెమలి ఈకలు ఆయన అందాన్ని పెంచుతాయి. నెమలి ఈకలను సమర్పించడం వల్ల గ్రహ దోషాలు మరియు కాలసర్ప దోషం తొలగిపోతాయి.
జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి ఏమి సమర్పించాలి?! (What to Offer to Lord Krishna on Janmashtami?!)
మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి యొక్క నివాసం వైజయంతి మాలలో ఉందని నమ్ముతారు. కృష్ణాష్టమి రోజున వైజయంతి దేవిమాల కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి పూజగదిలో పెట్టడం వలన మీకు పుణ్య ఫలం దక్కుతుంది. మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుంది.
మన హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం గోవులో నివసిస్తుంది అని మన హిందువులు నమ్ముతారు. శ్రీకృష్ణుడు గోవులంటే చాలా చాలా ఇష్టం. కృష్ణాష్టమి రోజున ఆవు లేదా ఆవు దూడల యొక్క చిన్న విగ్రహాలు కొనుగోలు చేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి. ఇలా చేయడం వలన ఆ శ్రీకృష్ణుడు సంతోషించి మిమ్మల్ని మీ యొక్క ఇంటి సభ్యులను ఆశీర్వదిస్తాడు. దాని వలన మీ అదృష్టం పెరుగుతుంది మీ పిల్లలు ఆనందంగా ఉంటారు.
Related Posts
Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?
Krishna janmashtami 2025 | శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత & పూజా విధానం
Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు
వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu
Shravana Putrada Ekadashi 2026 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant








