Bhanu Saptami 2024 in Telugu | భాను సప్తమి రోజు పాటించవలిసిన నియమాలు ఏమిటి? ఈ నియమాలు ప్రతి ఆదివారానికి?

0
7036
Bhanu Saptami 2023 in Telugu
Bhanu Saptami 2024

Bhanu Saptami 2024 in Telugu

భాను సప్తమి 2024 తేదీలు మార్చి 3, ఆగస్టు 11, ఆగస్టు 25, డిసెంబర్ 8 మరియు డిసెంబర్ 22. ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది.

2భాను సప్తమి రోజు ఏమి చేయాలి? (What to do on Bhanu Saptami Day?)

ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.

సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక, ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం.

ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు. ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి భావం తినకూడని పదార్ధాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది.

స్త్రీ సమాగమము, తైలం రాసుకోనుట, మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు,వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.

ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు.

కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.

ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం.

సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను, ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి. శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు ఇది అందరికీ తెలిసినదే ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది.

ఓ శ్రీ సూర్యనారాయణాయ నమ:. జై శ్రీమన్నారాయణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here