శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?

0
1979
shiva abhishekam
శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?

shiva abhishekam

 
శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని పురోహితులు చెబుతున్నారు. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు…ధనధాన్యాలు ప్రాప్తిస్తాయట. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏవిధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకొండి.
 
 • ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించును
 • ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగును
 • మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించును
 • గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు.
 • నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు.
 • పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు.
 • చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగును
 • పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును
 • రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు.
 • కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగును
 • పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here