
Bhanu Saptami 2026 in Telugu
భాను సప్తమి, సూర్య సప్తమి అని కూడా పిలుస్తారు, ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. భాను సప్తమి 2026 తేదీలు జనవరి 25, ఫిబ్రవరి 8, జూన్ 7, జూన్ 21, అక్టోబర్ 18, నవంబర్ 1. ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
1భాను సప్తమి రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి? (What are the Rules to Follow on Bhanu Saptami Day?)
వాటిలో ప్రధానంగా చూస్తే…మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు,ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి.
మూడవది ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.నాల్గవది ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.
నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు.
సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది.
సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది.సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.
ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినమున లాంటిది, గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.







