శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతీ & ఈరోజే ఎందుకు పూజిస్తారు? | Why Lord Shiva is Worshipped on Monday?

0
1356
why Monday is special for lord shiva
What is the Reason That Lord Shiva is Worshiped on Monday?!

What Is The Sacred Connection Between Monday And Lord Shiva?

1సోమవారం మరియు శివుని మధ్య పవిత్ర సంబంధం ఏమిటి?

మన హిందూ దేవుళ్ళ లో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజు ప్రీతికరం. అలాగే పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. సోమవారం రోజున పరమశివునిని పూజిస్తే క‌ష్టాల తొలగి అనుగ్రహిస్తాడని భక్తులు నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు సోమవారం రోజున ఆ ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అసలు ఈ విశ్వాసం వెనుక దాగి ఉన్న కార‌ణ‌మేంటి? సోమ‌వారం అంటేనే పరమేశ్వరునికి ఎందుకంత ప్రితీ? అనే విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

శివుడిని సోమవారమే ఎందుకు పూజించాలి?! (Why should Lord Shiva be worshiped on Monday?!)

1. దక్ష రాజు త‌న యొక్క 27 మంది దత్త కుమార్తెలను చంద్రుడితో వివాహం చేస్తాడు. చంద్రుడి యొక్క ఈ 27 మంది భార్యలను 27 న‌క్షత్రాలుగా సూచిస్తారు.
2. చంద్రుడికి వారందరిలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. చంద్రుడు రోహిణితోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతు మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు.
3. చంద్రుడు త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మిగిలిన భార్యలు ఏడ్చుకుంటూ వారి యొక్క తండ్రయిన ద‌క్షుడి వ‌ద్దకు వెళ్లి మొర పెట్టుకుంటారు.
4. వారి భాధ విన్న ద‌క్షుడు చంద్రుడికి మిగిలిన‌వారిని కూడా రోహిణితో స‌మానంగా చూడ‌మ‌ని న‌చ్చజెబుతాడు. విన‌క‌పోవ‌డంతో హెచ్చరిస్తాడు.
5. ఎంత‌ నచ్చచెప్పిన చంద్రుడిలో మార్పు రాకపోయేసరికి ఆగ్రహానికి గురైన ద‌క్షుడు చంద్రుడిని శ‌పిస్తాడు.
6. ద‌క్షుడి యొక్క శాపం వలన చంద్రుడు రోజురోజుకీ త‌న యొక్క ప్రభను కోల్పోపోతాడు. దానితో పాటు ప‌రిమాణం కూడా త‌గ్గిపోతుంటాడు.
7. ఈ హ‌ఠాత్పరిణామంతో చంద్రుడు భయంతో వెంటనే బ్రహ్మ దేవుడి వద్ద మొర‌పెట్టుకుంటాడు. త‌న‌ను ఆ శాపం నుండి ర‌క్షించమ‌ని వేడుకుంటాడు.
8. ఆ మ‌హాశివుడు మాత్రమే నీకు సాయం చేయ‌గ‌ల‌డ‌ని బ్రహ్మ దేవుడు చద్రునుకి చెబుతాడు. బ్రహ్మ సూచ‌న మేర‌కు చంద్రుడు పరమేశ్వరుని ప్రసన్నం కోసం ఆయ‌న్ను ఆరాధించ‌డం మొద‌లుపెడ‌తాడు.
9. చంద్రుడికి ఎన్ని ఆటంకాలు వచ్చిన వాటిని ప‌ట్టించుకోకుండా త‌న పూజ‌ను కొనసాగిస్తుంటాడు. తన భ‌క్తికి మెచ్చి పరమశివుడు చంద్రుని ఎదుట ప్రత్యక్షం అవుతాడు. తిరిగి త‌న శ‌క్తి పొందేలా అనుగ్రహిస్తాడు.
10. అప్పటికే ద‌క్షుడి యొక్క శాపం వల్ల ప్రభ‌ను కోల్పోయి ఉండ‌టం వలన ప్రతి మాసంలో 15 రోజులు క్రమంగా న‌శిస్తూ అమావాస్య నాటికి శ‌క్తిని కోల్పోతాడ‌ని, ఆ త‌ర్వాత మల్లి 15 రోజులు త‌న శ‌క్తిని పుంజుకుంటాడ‌ని పరమశివుడు వరం ఇస్తాడు.
11. చంద్రుడికి సోముడు అనే నామంతో కూడా పిలుస్తారు. ద‌క్షుడి యొక్క శాపం నుంచి చంద్రుడిని ర‌క్షించాడు కాబ‌ట్టి ప‌ర‌మశివుడుని చంద్రశేఖ‌రుడు మరియు సోమ‌నాథుడు అని కూడా పిలుస్తారు.
12. ఈ కార‌ణం చేతనే సోమ‌వారం అత్యంత భ‌క్తి శ్రద్ధలతో పరమశివుడిని పూజిస్తే క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డేస్తాడ‌ని మన భ‌క్తులు విశ్వసిస్తుంటారు.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Spiritual Posts

Gita Jayanti 2025 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?

Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ

Utpanna Ekadashi 2025 | ఉత్పన్న ఏకాదశి తేదీ, కథ, పూజ విధి & ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals

హిందు పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఏ దేవుళ్లను దర్శించుకోవాలి?! Which God Temples is Worshiped During Karthika Masam?

కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఏం చూడాలి? ఏం చూడకూడదు? | Kartika Masam Rules to Follow

దీపావళి రోజున ఈ జంతువుల్ని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది ?! | What To See on Diwali Festival?

శరద్ పూర్ణిమ 2025 తేదీ & విశిష్ఠత | Sharad Purnima 2025