
From Metal to Clay Lord Ganesh Idol Rituals & Results
1లోహం నుండి మట్టి వరకు గణేష్ విగ్రహలు వాటి పూజ విధానం & వాటి ఫలితాలు
మనం చేసే పాప దోషాలు తొలగడానికి వినాయకుడిని పూజిస్తే మంచిది మన పురాణాలను అనుసరించి పురోహితులు చెబుతున్నారు. మనం చేసిన పాప దోషాలు తొలగిపోవాలంటే ఈ విధంగా వినాయక ఆరాధన చేయాల్సిందే. వినాయక చవితి రోజున భక్తులందరూ వారి ఆర్థిక స్థోమత బట్టి రకరకాల వినాయక విగ్రహాలు విక్రయించి తీసుకువచ్చి తమ నివాసంలో పెట్టుకుని పూజలు చేస్తుంటారు. ఏ రకమైన వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గణేష్ విగ్రహం రకాలు & వాటిని పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటి? (Types of Ganesh Idols & What are the Results of Worshiping Them?)
1. ఎర్రచందనం (Red Sandalwood) : సూర్య దోషం తొలగిపోవాలన్న & అనారోగ్య సమస్యలు కుదుటపడాలన్న ఎర్రచందనంతో చేసిన వినాయకుడిని పూజించాలి.
2. వెండి లేదా పాలరాతి (Silver or Marble) : చంద్ర దోషం తొలగిపోవాలంటే వెండి లేదా పాలరాతితో చేసిన వినాయకుడిని పూజించాలి.
3. రాగి (Copper): కుజ దోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతి పూజ చేయడం వలన ఫలితం దక్కుతుంది.
4. మరకత (marakata) : బుధ దోషం తొలగిపోవాలంటే మరకత వినాయకుడిని కొలావాలి.
5. పసుపు మరియు చందనం లేదా బంగారం (Turmeric and Sandalwood or Gold) : గురు దోషం తొలగిపోవాలంటే పసుపు మరియు చందనం లేదంటే బంగారంతో చేసిన వినాయకుడిని పూజించాలి.
6. స్ఫటికం (Crystal): శుక్ర దోషం తొలగిపోవాలంటే, సుఖశాంతుల కోసం స్ఫటిక వినాయకుడుని పూజించాలి.
7. మట్టి (Clay) : రాహు గ్రహ దోషం తొలగిపోవాలంటే, సకల శుభాల కోసం మట్టితో చేసిన వినాయకుని పూజ చేయడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది.
8. తెల్ల జిల్లేడు (White Calotropis Gigantea) : కేతు గ్రహ దోషం తొలగిపోవాలంటే తెల్ల జిల్లేడుతో తయారుచేసిన వినాయకుడికి పూజ చేయాలి.
9. పగడం (Coral) : అప్పుల బాధలు తొలగాలంటే పగడపు వినాయకుడిని పూజించాలి.
10. పాలరాయి (Marble) : మానసిక ప్రశాంతత కోసం పాలరాయి వినాయకుడిని పూజించాలి.
11. శ్వేతార్క (Swetark Ganpati) : సమస్యలు విముక్తి కోసం శ్వేతార్క వినాయకుడిని పూజించాలి.
గణేశ విగ్రహాలను బట్టి వాస్తు చిట్కాలు (Vastu Tips Depending on Ganesha Idols)
1. గణపతి తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే వాస్తు దోషాలు తొలగుతాయి.
2. గణపతి తొండం కుడి వైపు తిరిగి ఉంటే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయట.
3. గణపతి విగ్రహం మధ్యలో తొండం ఉంటే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది.
4. తెలుపు రంగు గణపతి పూజిస్తే శాంతికి సంకేతం.
5. రావి ఆకు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయి.
6. వెండితో చేసిన గణపతిని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు గావిస్తారు.
7. ఇత్తడితో చేసిన గణపతిని పూజిస్తే సుఖసంతోషాలు కలుగుతాయి.
8. శని దోషం తొలగిపోవాలంటే నల్లరాయిపై చెక్కిన వినాయకుడిని పూజించాలి.
Related Posts
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu