
Akhanda Deepam for Navaratri Durga Puja
దేవి నవరాత్రులల్లో అఖండదీపం ఇలా వెలిగించండి
అఖండదీపం వెలిగించాలి అనే నియమం మాత్రం లేదు. వెలిగించడం తప్పేమీ కాదు. అదొక సంప్రదాయంగా ఉన్నది. అఖండ దీపం కూడా తొమ్మిది రోజుల పాటు కలశంతో లేదా ప్రతిష్టింపబడినటువంటి మండపంతో పాటు ఉండాలి అని ఒక నియమం ఉన్నది. అఖండ దీపం పెట్టినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తొమ్మిది రోజులు అది ఏమాత్రం ఘనమెక్కకుండా చూసుకోవాలి. దీపం ఆరకుండా అనరాదు. ఘనమెక్కకుండా అనాలి. అందుకు తొమ్మిది రోజుల పాటు దీపం పూర్తి కాకుండా జాగ్రత్త పడాలి.
అటువంటి నమ్మకము, పరిస్థితి ఉన్నప్పుడు అఖండదీపం పెట్టుకోవచ్చు. దీప ప్రజ్వలనకి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే దేవతా శక్తులను ఆవహింపజేయుట. ఎందుకంటే దేవతలు ప్రకాశశరీరులు, కాంతిశరీరులు. కాంతిశరీరులైన దేవతలు అక్కడికి రావాలి అంటే కాంతి స్వరూపమైన దీపం ఉండాలి. అందుకే దేవతారాధనకి పూర్వమూ, మధ్యలో దీపం వెలిగిస్తారు. చివరికి నీరాజనం రూపంలో కూడా జ్యోతినిస్తారు. జ్యోతిశరీరులైన ఆ దేవతాశక్తులు అక్కడికి వచ్చి యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలి అనే ఉద్దేశ్యంతో ముందు అఖండ దీపాన్ని వెలిగించడం కనపడుతున్నది. అదేవిధంగా మన సంకల్పం అఖండంగా వృద్ధి చెందాలి అది సిద్దిపొందాలి అనే ఉద్దేశ్యం కూడా అఖండదీపాన్ని వెలిగించడం కనపడుతున్నది. మరొక ఉద్దేశ్యం అఖండ దీపం వెలిగించడం వల్ల అన్నిరకాల దోషాలూ పోతాయి. ముఖ్యంగా ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది.
ఈ కారణం చేత అఖండ దీపాన్ని పెట్టడం ఆ జ్యోతి రూపంలో ‘లోకైక దీపాంకురాం‘ అయినటువంటి అమ్మవారిని ఆరూపంలో ప్రతిష్టించి ఆరాధిస్తున్నాం. కలశము, విగ్రహము పటము అని వాటితో పాటు మనం ఇక్కడ తీసుకుంటున్నది జ్యోతి. ఆ దీపజ్యోతి యందు అమ్మవారు ఆ తొమ్మిది రోజులూ కదలకుండా ఉండి మన చేత ఆరాధన పొందుతున్నారు. ఆ లోకైక దీపాంకురాం అయినటువంటి జ్యోతిస్స్వరూపానికి సంకేతంగానే అఖండ దీపారాధన చెప్పబడుతూ ఉన్నది.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Navaratri Durga Puja Related Posts
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/