
Vaikunta Ekadasi Celebrations At Tirumala Tirupati Temple For Uttara Dwara Darshanam
1తిరుమలలో వైకుంఠ ఏకాదశి జరిపే విధానం
కలియుగ వైకుంఠం అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకదశి చాల వైభవంగా జరపబడుతుంది. ఏకదశి ముందు రోజు దశమి రాత్రి ఏకంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసివేస్తారు. మరునాడు తెల్లవారుజామున వైకుంఠం ఏకదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకోని ఉన్న ఉత్తర ప్రవేశ ద్వారం తెరిచే ఉంటుంది. దిన్నే ముక్కోటి ప్రదక్షిణ మార్గం అని కూడా అంటారు. ఈ రెండు రోజులు భక్తులు ఈ ద్వారం నుంచే వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటారు.
వైకుంట ద్వాదశి (Vaikunta Dwadashi)
ద్వాదశి రోజు సూర్యోదయం వేళ “శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ కోటి” జరుగుతుంది. ఈరోజు ముల్లోకాలలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్య తీర్థాలు తిరుమల పుష్కరిణిలో దివ్య సూక్షం రూపంలో ఉంటాయి. అందులొనే సకల దేవతలు సన్నిధి చేసి ఉంటారు అని ప్రతీది. అందుకే ఈరోజు ఆలయంలో సుప్రభాతం, తోమల సేవ, అర్చన & నివేదనలు యధాలాపంగా జరుగుతాయి. తరువాత ఆనంద నిలయంలో ఉన్న సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిని అధిరోహించి ఊరేగింపుగా తిరుమల మాడ వీధుల్లో మహా ప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహ స్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. అక్కడ చక్రత్తళ్వార్ కు అభిషేకం చేసిన తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేపిస్తారు. ఈ సమయంలోనే భక్తులందరు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు. ఈ అవకాశం దొరకడం అనేది ఏన్నో జన్మల సుకృతం. తర్వాత చక్రత్తాళ్వార్ కు వస్త్రాలంకరం, నివేదన, హారతులు ఘనంగా నిర్వహిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయంకి చేరుకుంటారు.
తిరుమల పుష్కరిణిలో జరిగే చక్ర స్నానం (Chakra Bathing at Tirumala Pushkarini)
తిరుమల పుష్కరిణిలో ఒక సంవత్సంలో నాలుగు సార్లు చక్ర స్నానం జరుగుతుంది. అవి,
1. భాద్రపద శుద్ద చతుర్దశి – అనంత పద్మనాభ వ్రతం రోజు.
2. 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజు.
3. వైకుంఠ ఏకదశి మరుసటి రోజు ద్వాదశి ఉదయం.
4. రథ సప్తమి నాటి మధ్యాహ్నం.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Related Stories
వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration
Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు
Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ
Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర
Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు
Sankashtahara Chaturthi 2025 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?