భ‌క్తుల ద‌ర్శ‌నం పై వెన‌క్కి త‌గ్గిన టీటీడీ

0
1470

Back

1. భ‌క్తుల ద‌ర్శ‌నం పై వెన‌క్కి త‌గ్గిన టీటీడీ

మహా సంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకుంది. అనవసరమైన అనుమానాలు, అవాస్తవ ప్రచారాలకు అడ్డుకట్టే వేయడం… భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడటమే తమ ఉద్దేశమని టీటీడీ స్పష్టం చేసింది. దర్శనం రద్దుపై పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశించినట్లు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, పాలకమండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాలు రద్దు చేయాలని తొలుత ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు పునఃసమీక్షిస్తున్నాం, ఏరోజు ఎన్ని గంటలపాటు దర్శన వేళలు అందుబాటులో ఉంటాయి తదితర అంశాలపై వారు స్పందించారు. రోజుకు స‌గ‌టున 20 వేల మంది భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here