భ‌క్తుల ద‌ర్శ‌నం పై వెన‌క్కి త‌గ్గిన టీటీడీ

0
1445

2. ముందుగా టీటీడీ నిర్ణ‌యం…

2006లో మహా సంప్రోక్షణ నిర్వహించినప్పుడు రోజుకు సగటున తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 30వేలు మాత్రమే. ఇప్పుడా సంఖ్య సాధారణ రోజుల్లో 70 వేలు, వారాంతపు సెలవుల్లో 90వేలకు చేరింది. పైగా… ఆగస్టు 11 నుంచి వరుస సెలవులు వస్తుండటంతో భక్తుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. సంప్రోక్షణ జరిగే సమయంలో రోజుకు గరిష్ఠంగా 20వేలకు లోపే భక్తులకు దర్శనం చేయించే అవకాశం ఉండటంపై అత్యవసరంగా సమావేశమై చర్చించారు. రద్దీని ఎదుర్కొవడం అసాధ్యమని, భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని భావించామ‌ని టీటీడీ పేర్కొంది. దీంతో దర్శనం పూర్తిగా రద్దు చేయడమే పరిష్కారమని, వైదిక క్రతువు కూడా సవ్యంగా సాగుతుందనే అభిప్రాయానికి వచ్చాం. అందుకే ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు దర్శనం రద్దు విషయాన్ని ప్రకటించామ‌ని టీటీడీ తెలిపింది.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here