
శ్రీ మహా లక్ష్మీ దేవి
తేదీ: 06-10-2024, ఆదివారం
సందర్భం: నవరాత్రుల 4వ రోజు (అశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి)
అలంకారం
ఈ రోజున అమ్మవారిని శ్రీ మహా లక్ష్మీ రూపంలో పచ్చ (తోటకూర) రంగు చీరతో అలంకరిస్తారు.
ప్రసాదం:
- బెల్లం (జగ్గరీ)
- పాయసం (పుడ్డింగ్)
పఠించవలసిన మంత్రం:
“ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనమ్యే వశమానాయ స్వాహా“
ఈ మంత్రాన్ని 1108 సార్లు జపించడం చేయాలి.
మహాలక్ష్మీ అష్టకం
- నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే || - నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || - సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || - సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయినీ |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే || - ఆద్యంతరహితే దేవి ఆది శక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తు తే || - స్థూలసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || - పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || - శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్త్స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే ||
ఈ అష్టకం 11 సార్లు జపించాలి.
ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి?
నాలుగవ రోజు అమ్మవారిని పచ్చ చీరతో అలంకరించి, బెల్లం మరియు పాయసం సమర్పించాలి.
ఈ రోజు ఎలాంటి వాగ్వివాదాలు, కోపతాపాలు ప్రదర్శించకుండా ఉండాలి. శనిగ్రహం వల్ల వృత్తిలో జాప్యం మరియు ఇతర సమస్యలు రావచ్చు. అందువల్ల వాతావరణం శాంతంగా ఉంచడం ముఖ్యం.
వినాయకుడికి గరిక పువ్వు సమర్పించడం:
విద్య, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు తమ మేనత్త, మేనమామ ఆశీర్వాదం తీసుకుని వినాయకుడికి గరిక పువ్వు సమర్పించడం మంచిదిగా పరిగణించబడుతుంది.
గోమాతకు తిలకుడు పిండి సమర్పించడం:
ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు గోమాతకు తిలకుడు పిండి సమర్పించడం ద్వారా సమస్యలను తొలగించుకోవచ్చు.
ఆర్థిక సమస్యలు:
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు దద్దోజనం (పెరుగు అన్నం) ఉల్లిపాయతో వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి భోజనం ఇవ్వడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక:
ఈ రోజున పూజలు చేసే వారు ఎవరినీ క్షోభ పెట్టకూడదు.
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో క్రింది లింక్ లో తెలుసుకోండి.
https://onelink.to/ppsjem
Navaratri Durga Puja Related Posts
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
శరన్నవరాత్రులలో శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ విశేషాలు
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram