Akshinthalu Significance | ఆశీర్వచనం, పూజలో అక్షింతలు ఎందుకు? వాటి విశిష్టత

0
13233
అక్షతల విశిష్టత
 Akshinthalu Significance in Telugu

1. అక్షింతలు అంటే ఏమిటి?

అక్షతలు/అక్షింతలు అంటే క్షతం కానివి. అంటే నాశనం కానివి అని అర్థం.

అక్షింతలను ఎలా కలపాలి?

విరగని బియ్యపు గింజలను పసుపు లేదా కుంకుమతో కొద్దిగా నెయ్యి లేదా నూనె కలిపి అక్షతలను చేస్తారు. భగవంతుని పూజలో నూ, చిన్నవారిని దీవించడానికీ, పెళ్ళిలో తలంబ్రాలకూ అక్షతలను వాడతాం. ఏ ద్రవ్యాలూ కలపని తెల్లని అక్షింతలతో పరమశివుణ్ణి పూజిస్తాము.

భగవంతుని పూజలో అక్షింతలు ఎందుకు వాడతాము?

మనసు చేత, వాక్కు చేత, కర్మల చేత  మనం భగవంతుని అర్చిస్తున్నామన్నందుకు గుర్తుగా అక్షతలు చల్లుతాం. మనస్సుకు అధిపతి అయిన చంద్రునికి ప్రీతి కరమైనవి బియ్యం. బియ్యం మన శరీరం లోని విద్యుత్తుకు వాహకంగానూ పనిచేస్తుంది.

భగవంతుని శక్తి, ఆశీర్వాదం ఆ అక్షతల ద్వారా మనం మళ్ళీ పొంది, తిరిగి తలపై ధరిస్తాం. అక్షతలకు ఉన్న సహజమైన గ్రాహక శక్తి వల్ల  భగవంతుని వద్దనుంచీ ఆధ్యాత్మిక తరంగాలను పొందుతాం. పిల్లలకు లేదా మన దీవెనలు కోరే వారిని అక్షతలతో దీవించడానికి కారణం వారి మనోవాంఛలు క్షతం కాకుండా నెరవేరాలని.

అక్షతలు చల్లే వారి లోని సద్గుణాలు మంచి జరగాలన్న భావన అక్షతల ద్వారా నమస్కరించేవారి తలపైపడి ఆలోచనల్లో మంచి మార్పులను తెస్తుంది. పెళ్లి లో తలంబ్రాలు పోసే సాంప్రదాయం కూడా ఆ జంట నిండు నూరేళ్లూ అన్యోన్యంగా తరగని ప్రేమాదరాలతో వర్ధిల్లాలని.

ధాన్య లక్ష్మితో సమానమైన వధువు తమ ఇంట కాలుమోపి ధాన్య రాశులను కురిపించాలనీ, ఒకరి మనసును,ఆలోచనలను మరొకరితో అరమరికలు లేకుండా పంచుకోవాలన్నదే పెళ్ళిలో తలంబ్రాల పరమార్థం.

పసుపుగానీ కుంకుమ గానీ కలపడం శుభసూచకమే కాదు ఒకరినుంచీ ఒకరికి ఎటువంటి చర్మరోగాలు, సూక్ష్మ క్రిములూ సోకకూడదని. నూనె లేదా నెయ్యి విద్యుత్వాహకాలు. పసుపును బియ్యానికి అంటుకుని ఉండేలా చేయడమే కాదు.

మునివెళ్లపైనుండి జారినప్పుడు అక్కడి విద్యుత్తరంగాలను తలపైన పడ్డప్పుడు, అక్కడి సహస్రార చక్రానికి ప్రేరేపకంగా పనిచేసి అక్షతలు చల్లే వారి నుండీ పాజిటివ్ తరంగాలను మనలోకి చేరవేస్తాయి.

చేయకూడనివి

అక్షతలను విరిగిన బియ్యం తో కలపరాదు. తొక్కకూడదు. తొక్కిన అక్షింతలను తిరిగి వాడరాదు.

Related Stories

Hindu Festivals | పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు ?

వేదాల ప్రకారం భానుడి భగభగలకు కారణం ఇదేనా? | Science Vs Vedas | Heat Wave Remedies as Per Hindu Vedas

శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు?! Why Buy Gold in Shravana Masam Varalakshmi Vratam

అక్షయ తృతీయ నాడు దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి?

తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Tholi Ekadashi 2025 in Telugu

Lord Venkateswara Swamy Pooja Vidhanam | అష్టైశ్వర్యాలు పొందండానికి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించండి.

Lord Venkateswara Swamy Vratha | కష్టాల తీర్చే శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతం & గోవింద నామాల మహిమ.

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here