అక్షయ తృతీయ నాడు ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? | What Should We Donate on Akshaya Triteeya in Telugu

0
7121

hindu-festival-13

శయన దానము

: అక్షయ తృతీయనాడు చాపను లేదా మంచాలను కానీ పరుపులను కానీ దుప్పట్లను కానీ దానం చేయడం వల్ల ఆ ఇంటిలోనివారికి పీడకలలు రావడం తగ్గుతుంది. అన్యోన్య దాంపత్యం కోసం కూడా శయన దానం చేస్తారు.

వస్త్ర దానము

:  వస్త్రదానం వలన దాత(దానం చేసినవారు) ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండీ కాపాడబడతాడు.

కుంకుమదానము

: అక్షయ తృతీయనాడు కుంకుమ దానం చేయడం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుంది.

చందన దానము

: అక్షయతృతీయనాడు చందన దానము చేయడం వలన కీర్తి లభిస్తుంది.

తాంబూలము

: తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారలాభాలు, రాజకీయనాయకులకు ఉన్నతపదవులూ సంప్రాప్తిస్తాయి.

నారికేళ దానము

: అక్షయ తృతీయనాడు కొబ్బరికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.

తక్ర దానము

: తక్రము అంటే మజ్జిగ. అక్షయ తృతీయనాడు దాహార్తులకు మజ్జిగను దానం చేయడం వలన ఉన్నత విద్యాప్రాప్తి కలుగుతుంది. అన్ని రంగాలలోనూ రాణిస్తారు.

ఉద కుంభ దానము

:  అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలలో ఉదకుంభ దానము ఎంతో విశిష్టమైనది. రాగి లేదా వెండి కలశం లో కుంకుమపువ్వు, కర్పూరం. తులసి, వక్క కలిపిన నీటిని దానం చేయడం వలన వివాహం కాని వారికి శీఘ్రవివాహం, పిల్లలు లేనివారికి పుత్ర ప్రాప్తి కలుగుతాయి.

పాద రక్షా దానము

: అక్షయ తృతీయనాడు పాద రక్షలు(చెప్పులు) దానం చేయడం వలన నరకబాధలు తొలగుతాయి.

ఈరోజు – అక్షయ తృతీయ, ఏమి చేయాలి! ఎందుకు చేయాలి! ఆ రోజు బంగారం కొంటే ఏమవుతుంది? | Why to Buy Gold in Akshaya Tritiya

What is the reason behind buying gold on Akshaya Tritiya?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here