
Shani Trayodashi Importance in Telugu
1. శని ప్రదోష వ్రతం 2025 తేదీ & సమయం (Shani Pradosh Vrat 2025 Date & Timing )
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
శని ప్రదోష వ్రతం 2025 తేదీలు & సమయం
- శనివారం, జనవరి 11, 2025. త్రయోదశి జనవరి 11న ఉదయం 8:22 గంటలకు ప్రారంభమై జనవరి 12న ఉదయం 6:34 గంటలకు ముగుస్తుంది.
- శనివారం, ఏప్రిల్ 26, 2025. త్రయోదశి ఏప్రిల్ 25న ఉదయం 11:45 am గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 26న ఉదయం 8:28 am గంటలకు ముగుస్తుంది.
- శనివారం, మే 10, 2025. త్రయోదశి మే 9న ఉదయం 2:56pm గంటలకు ప్రారంభమై మే 10న ఉదయం 5:30 pm గంటలకు ముగుస్తుంది.
శని త్రయోదశి ఎలా జరుపుకోవాలి? (How to Celebrate Shani Trayodashi?)
వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా “అష్టమ” , “అర్ధాష్టమ” , ” ఏలినాటి శని ” లతో బాధ పడుతున్నవారు.రేపు ఉదయం “శన్యూష కాలంలో” అనగా తెల్లవారుజామున 5.00 నుండి 6:30 మధ్యకాలంలో లేదు ” శని హోరలో” అనగా ఉదయం 6:30 నుండి 7:30 మద్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు. సాయంత్రం “ప్రదోష వేళలో ” అనగా 5:30 to 6:30 మధ్య కాలంలో శివాలయం లో “నువ్వల నూనె” తో దీపారాధన చేసిన ఉన్నతమైన ఫలితాలు పొందుతారు.
- సూర్యోదయానికి ముందే స్నానాదికాలను ముగించుకుని శనైశ్చరుడిని ఆరాధించాలి.
- నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం| -అనే శని ధ్యాన శ్లోకాన్ని పఠించాలి.
- ఈరోజున ఉపవాసం ఉండడం మంచిది.
- శని శాంతి పూజలు ఈ శనిత్రయోదశినాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి.
- శనికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
- నల్లని వస్త్రాలను ధరించడం దానం చేయడం రెండూ మంచిదే.
- కొన్ని నల్లనువ్వులు, కొద్దిగా నువ్వులనూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఏడంగుళాల నల్లని రిబ్బను, ఎనిమిది ఇనుప చీలలు/మేకులు(nails), కొన్ని నవధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. లేదా పారే నదిలో విడిచిపెట్టాలి.
- కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చెయ్యాలి.
- శని త్రయోదశినాడు నూనె గానీ, గొడుగు కానీ, నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాద.
Pasaam veerareddy