Pausha Putrada Ekadashi 2025 | పౌష పుత్రద ఏకాదశి ఆచారాలు, పూజ విధానం & ప్రాముఖ్యత

0
884
Putrada ekadashi
What are Pausha Putrada Ekadashi Ritual, Puja Vidhi, Vrat Katha, Significance & Date?

Pausha Putrada Ekadashi 2025

1పౌష పుత్రద ఏకాదశి 2025

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మన హిందూ ఆచారలలో ఏకాదశిలకు చాల గొప్ప ప్రాముక్యత ఉంది. ఈ రోజున భక్తులు అందరూ మహావిష్ణువును పూజించడం అనవాయితిగా వస్తుంది. ఈ ఏకాదశిలలో పౌష్ పుత్రద ఏకాదశి ఒకటి. ఈ రోజున భక్తులు ప్రజలు ఉపవాసం ఉండి మహావిష్ణువుకు ప్రార్థనలు చేస్తారు. దృఢమైన భక్తిభావంతో ఉపవాసం పాటిస్తే, విష్ణువు సుఖ, సంతోషాలను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి ‘పౌష’ మాసంలోని శుక్ల పక్షం సమయంలో ‘ఏకాదశి 11వ రోజు వస్తుంది. ఈ ఏకాదశిని ముఖ్యంగా పుత్రుడు కావాలి అనుకునే దంపతులు ఆచరిస్తారు. అయితే ఈ ఏకాదశి కథ, ప్రాముక్యత, పూజ విధానం, ఈ ఏకాదశి ఎలా ఆచరించాలి అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

పౌస పుత్రదా ఏకాదశి 2025 తేదీ & సమయం (Pausha Putrada Ekadashi 2025 Date & Muhurtam) :

ఈ సంవత్సరం జనవరి 10, 2025 ఆదివారం రోజున ఈ ఏకాదశి వచ్చింది.

ఏకాదశి తిథి జనవరి 09, 12:22:42 AM ప్రారంభమై,
ఏకాదశి తిథి జనవరి 10, 10:19:50 AM ముగుస్తుంది.

పౌస పుత్రదా ఏకాదశి కథ (Pausha Putrada Ekadashi Katha / Story) :

హిందూ పురాణాల ప్రకారం సుకేతు రాజు తన యొక్క భార్య అయిన శైవతో కలిసి భద్రావతిలో నివాసం ఉండేవారు. వారిద్దరూ జీవితంపై ఎదైన అసంతృప్తి ఉంది అంటె అది వారికి కొడుకు లేకపోవడమే. వారి చనిపొయిన తరువాత శ్రాద్ధ కర్మలను చేయడానికి కోడుకు లేడు అని ఆలోచిస్తూ కృంగిపోయారు. ఆ మనస్థాపతో వారు రాజ్యాన్ని విడిచి అడవి భాట పట్టారు. అడవికి అంత సంచరించిన వారు చివరికి పౌష పుత్ర ఏకాదశి రోజున మానస సరోవరం దగ్గరలో ఉన్న ఓక్ ఆశ్రమానికి చేరుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు మీరు రాజ్యాన్ని విడిచి రాడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు రాజు గారి దంపతులు వారి గల భాదని వారికి వివరిస్తారు. ఆ ఋషులు పుత్ర ప్రసాదం పొందడానికి పౌష్ పుత్ర ఏకాదశి వ్రతాన్ని చేయమని వారికి సూచిస్తారు. వారి సూచన మేరకు ఆ దంపతులు తిరిగి రాజ్యానికి వచ్చి పౌష్ పుత్రద ఏకాదశి యొక్క ఆచారాలను అనుసరించి ఉపవాసం పాటిస్తారు. వారు ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య ఆశీర్వాదం పొంది పుత్రుడుకి జన్మనిస్తారు.

పౌస పుత్రదా ఏకాదశి రోజు పాటించవల్సిన పూజ ఆచారాలు (Pausha Putrada Ekadashi Puja & Rituals) :

1. ఈ రోజున వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించి, మంచి బట్టలు ధరించాలి.
2. ఈ రోజున భక్తులు పూర్తి భక్తితో ఉపవాసం ఆచరించాలి.
3. శ్రీ యంత్రంతో పాటు విష్ణువు యొక్క విగ్రహాన్ని ఉంచి, నెయ్యితో దీపాన్ని వెలిగించి, పువ్వులు స్వీట్లను సమర్పించాలి.
4. తులసి పత్రంతో పాటు పంచామృతాన్ని విష్ణుమూర్థికి సమర్పించాలి.
5. విష్ణువుకు సమర్పించే ప్రధాన మూలికే ఈ తులసి పత్రం.
6. తులసి పత్రాన్ని సమర్పించకపొతే, ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
7. సూర్యాస్తమయానికి ముందు పూజ చేసి విష్ణువుకు భోగ్ ప్రసాదం సమర్పించి, విష్ణు సహస్రనామం, శ్రీ హరి స్తోత్రం పఠించాలి.
8. స్వామికి హారతి ఇచ్చి భోగ్ ప్రసాదాన్ని అందరికి పంచి, సాత్విక భోజనం చేసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు.
9. విష్ణుమూర్తి దీవెనల కోసం భక్తులు తప్పనిసరిగా దేవాలయాన్ని సందర్శించాలి.
10. సాయంత్రం తులసి మొక్కలో దీపం వెలిగించాలి.

పౌష్ పుత్రద ఏకాదశి రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు (Precautions To Be Taken on Pausha Putrada Ekadashi):

1. ఈ ఏకాదశి రోజున తులసి ఆకులు తుంచకూడదు. ఇది అశుభమగా పరిగణిస్తారు.
2. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని ఆహారమ్హా తీసుకోవద్దు.
3. ఈ రోజున మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి.
4. పక్కవారి గురించి చెడుగా మాట్లాడకండి.

పౌష్ పుత్రద ఏకాదశి రోజున పఠించాల్సిన మంత్రం (Mantra to be recited on Paush Putrada Ekadashi):

శ్రీ కృష్ణ గోవింద్ వారే మురారి హ నాథ్ నారాయణ్ వాసుదేవ!!
అచ్యుతం శీశ్వం కృష్ణ దామోదరం రామ్ నారాయణం జంకి శుభం!!
హరి రామ్ హరి రామ రామ రామ హరే హరే, వారే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హర
రామ్ రామ్ రామతి రమ రామ మనోరమ, సహప్రాణాం తతుల్యం రామ్ నామ్!!

Related Stories

Hindu Festivals in January 2024 | జనవరిలో హిందువుల ముఖ్యమైన పండుగలు | Hindu Important Days Calendar

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

Saphala Ekadashi 2024 | సఫల ఏకాదశి 2024 విశిష్ఠత, కథ, శుభ సమయం & పూజా విధానం

Makar Sankranti in Telugu | పుణ్యాల పండుగ – మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti