
Chant Stotra on Nirjala Ekadashi 2025
1రోజు చేయవలిసిన ముఖ్యమైన విధి విధానాలు:
ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కాని నిర్జల ఏకాదశి ప్రత్యేకం. నిర్జల ఏకాదశిని హిందువులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు చేసే ఉపవాసం చాల ఉత్తమమైనది. ఇది చాల కష్టమైనదిగా చేబుతారు. నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే కోరుకున్న కోరికలు నేరవెరుతాయి అని హిందువుల నమ్మకం. నిర్జల ఏకాదశి వ్రతం గొప్పతనం గురుంచి వేదాలలో చెప్పబడింది. ఒక్కో ఏకదశిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ రోజున పూజలు, ధన ధర్మాలు చేస్తే అక్షయ పుణ్యం వస్తుంది.
నిర్జల ఏకాదశికి మారు పేర్లు:
1. పాండవ ఏకాదశి
2. భీంసేని ఏకాదశి
3. భీమ ఏకాదశి
నిర్జల ఏకాదశి 2025 తేది & సమయం:
నిర్జల ఏకాదశి 2025 జూన్ 06, శుక్రవారం
ఏకాదశి తిథి ప్రారంభం : జూన్ 06, ఉదయం 2:16
ఏకాదశి తిథి సమాప్తం : జూన్ 07, ఉదయం 4:48
పారణ సమయం : జూన్ 01, 5:44 AM – 8:24 AM
నిర్జల ఏకాదశి రోజు ఏం చేయాలి? ఎలా చేయాలి?:
1. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి పసుపు వస్త్రాలు ధరించి స్నానం చేస్తే శుభప్రదం.
2. విష్ణు మూర్తిని ధ్యానించి పూజించాలి.
3. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించాలి.
4. శ్రీ హరిని ధూప, దీప, నైవేద్యములతో పూజించి, పసుపు పూలు, పండ్లు సమర్పించండి.
5. మీకు ఉన్న కోరికలను కోరుకొండి.
6. శ్రీ మహావిష్ణువుని ఏ విధమైన పొరపాటు చేస్తే క్షమించమని అడగండి.
7. సాయంత్రం వేళ విష్ణువును పూజించి, రాత్రి దీపదానం చేయండి.
8. రాత్రి భజనలు, కీర్తనలు చేస్తూ నేలపై మత్రమే నిద్రించండి.
9. బ్రాహ్మణులకు ఆహారాన్ని ధానంగా ఇవ్వండి.
నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:
- ఒకే సంవత్సరంలో 24 ఏకాదశులు పాటించడం వల్ల కలిగే పుణ్యాన్ని ఈ ఒక్క ఏకాదశి పాటించడం ద్వారా పొందవచ్చు.
- పాపాల నుండి విముక్తి
- వైకుంఠం, విష్ణువు నివాసం చేసే ప్రదేశానికి చేరుకోవడం
- శ్రీ, ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభించడం
నిర్జల ఏకాదశి వ్రతం యొక్క నియమాలు:
- ఈ రోజున, భక్తులు సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు (మరుసటి రోజు) నీరు మరియు ఆహారం తీసుకోకూడదు.
- ఉపవాసం సమయంలో, వారు విష్ణువును స్మరించుకుంటూ ధ్యానం, జపం చేయాలి.
- పాండురంగ రంగు దుస్తులు ధరించడం మంచిది.
- ఇంటిని శుభ్రం చేసుకోవడం మరియు పూజా స్థలాన్ని అలంకరించడం చాలా ముఖ్యం.
- దానం చేయడం ఈ రోజున చాలా పుణ్యకరమైనది.
నిర్జల ఏకాదశి వ్రత కథ: భీముడు ఎలా పుణ్యాన్ని పొందాడు?
హిందూ సంప్రదాయాల ప్రకారం, నిర్జల ఏకాదశి వ్రతాన్ని రెండవ పాండవ సోదరుడైన భీముడికి వ్యాస మహర్షి వివరించాడు. ఈ కారణంగానే ఈ వ్రతాన్ని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
మహాభారతం మరియు పద్మ పురాణం రెండింటిలోనూ నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్పబడింది. పాండవులు అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు, కానీ భీముడు మాత్రం తిండిపోతు ఆకలిని భరించలేక ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయాడు.
అయితే, భీముడు కూడా ఏకాదశి వ్రతం యొక్క పుణ్యాన్ని పొందాలని కోరుకున్నాడు. అందుకే, ఒకేసారి ఆహారాన్ని ఆస్వాదించడానికి మరియు ఉపవాసం కూడా పాటించడానికి ఒక మార్గాన్ని కనుగొనమని భీముడు వ్యాస మహర్షిని వేడుకున్నాడు.
కానీ, ఋషి భీముడికి భోజనం చేయడం మరియు ఉపవాసం పాటించడం రెండూ సాధ్యం కాదని చెప్పాడు. అయితే, ఒకేసారి 24 ఏకాదశి వ్రతాల ఫలాన్ని పొందే ఒక అద్భుతమైన మార్గాన్ని ఋషి భీముడికి సూచించాడు. అదే నిర్జల ఏకాదశి వ్రతం.
జ్యేష్ట మాసంలోని శుక్ల పక్షంలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని వ్యాస మహర్షి భీముడికి సలహా ఇచ్చాడు. భీముడు ఆ ఋషి వాక్కులను పాటించి, నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దీనివల్ల, భీముడు ఒకేసారి 24 ఏకాదశి వ్రతాల పుణ్యాన్ని పొందగలిగాడు.
నిర్జల ఏకాదశి రోజు పఠించాల్సిన స్తోత్రం:
విష్ణు సహస్రనామాల ని పఠించాలి.
ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Related Posts
Nirjala Ekadashi 2025 in Telugu | నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు
తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!