Ganesh Pooja for Better Education in Telugu
విధ్యలో ఆటంకాల కోసం వినాయకచవితి రోజున చేసే పూజ విధానం
ఎంత చదివినా అవసర సమయంలో గుర్తురాక విద్యా విషయాలలో ఆటంకాలు రావడము వలన ఎంతో విలువైన విద్యా సంవత్సరాలను కోల్పోతు ఉంటారు, మరి కొందరికి పరీక్షలలో పేపర్లు మిగిలిపోతు ఉంటాయి.
అటువంటి వారు ఈ గణేశ చతుర్ధీ నాడు, ఉదయం విగ్నేశ్వరుడికి:
-
రుద్రాక్ష మాల,
-
ఓక చిన్న జెండా లను అలంకరించి,
-
ఉత్తరేణి సమూలములు మరియు
-
ఎరుపు రంగు గులాబీ దళములతో అర్చించి,
-
కందులు, ఉలవలు, ఖర్జూరము లతో తయారు చేసిన పిండి వంటలను నైవేధ్యంగా సమర్పించాలి.
తర్వాత, విష్ణు ముహూర్త సమయములో (అనగా మధ్యాహ్నం గం. 12:23 నుండి 12:55 నిమిషాల లోపు):
-
ఉదయం స్వామి వారికి సమర్పించిన రుద్రాక్ష మాల, జెండా లను,
-
మరియు ఎరుపు / దుమవర్ణం లో ఉండే కండువ (టవల్) లను
-
తాత (అమ్మ తండ్రి)కి లేదా సద్బ్రాహ్మణుడికి దక్షిణతో సమర్పించి ఆశీర్వాదము తీసుకోవాలి.
అలాగే ఇదే సమయంలో, ఉదయం స్వామి వారికి సమర్పించిన నైవేధ్యాన్ని మీరు తినకుండా, ప్రసాదంగా పంచాలి.
ఈ ప్రసాదం తిన్న వారికి కూడా శుభం కల్గుతుంది. ఒకవేళ ప్రసాదం పంచడానికి సమీపంలో భక్తులు ఎవరు లేకపోతే, గోమాతకు తినిపించవచ్చు.
అవకాశం ఉంటే, ఈ ఒక్క రోజు మంచం మీద కాకుండా క్రింద (చాప) పడుకోవడానికి ప్రయత్నించండి.
(ఇది అత్యంత రహస్యమైన తాంత్రిక పరిహారము. తాంత్రిక పరిహారములు చాలా తక్కువకాలంలోనే ఫలితములను ఇవ్వడము గమనించవచ్చు).
రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ పరిశోధకులు
ఒంగోలు
Vinayaka Chaviti Festival Related Posts
గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?
వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?