
Known Facts About Goddess Lakshmi
లక్ష్మీ దేవి ఎక్కడ వుండదు?
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండడు
- శంఖద్వని వినిపించని చోటా.
- తులసిని పూజించని చోట.
- శంఖరుని అర్చించని చోట.
- బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
- ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.
- ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
- విష్ణువును ఆరాధించకుండ.
- ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
- హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
- అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
- చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
- నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
- పసుపక్షులను హింసించే చోట వుందనే వుండదు.
- సంపద మీద దురాస ఎక్కువగా కలవారి ఇంట వుండదు.
మరి లక్ష్మీ దేవి ఎక్కడ ఎక్కడ వుంటుంది అంటే :
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు. అన్నిటి కంటే సంతృప్తి కి మించిన ధనం ఎక్కువలేదు. దానితోనే సంతోషము కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళ శ్రీ మహా లక్ష్మి కరుణ మనతోనే వుంటుంది.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.
Related Posts
Key Signs of Goddess Lakshmi | మీ ఇంట్లో ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే లక్ష్మి దేవి వచ్చినట్టే!
Dhantrayodashi in Telugu | లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి.
శరత్ పూర్ణిమ రోజున ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. | Sharad Purnima 2025
Good Information,thank u.
Good information, Thank you.
Good information thank you