లక్ష్మీదేవి ఏ స్థానంలో ఉండాలి? | Lakshmi Devi

2
40020
Lakshmi Devi Images
Lakshmi Devi

Lakshmi Devi

మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి. ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు. అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు.

కాబట్టే పెద్దలు మానవశరీరంలో ఆ తల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితాలొస్తాయో సంకేత రూపంలో తెలియజేశారు.

ఈవిషయాన్నే జ్యోతిషశాస్త్ర రీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.
అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆ మానవులకు పెద్దపెద్దభంతులు, విలాసవంతమైన గృహాలు లభిస్తాయట.

తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది.గుహ్యభాగంలో ఉంటే భార్యాసుఖం సాంసారిక ఆనందం లభిస్తుంది

రొమ్ముభాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి. కంఠభాగంలో ఆతల్లి తేజస్సు ఉన్నప్పుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్దే కాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి, మధురమైన కవితా శక్తి పాండిత్యము లభిస్తాయి

ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో …! వాని దగ్గర నిలబడదు. వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలినతనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని దత్తాత్రేయస్వాములవారు దేవతలకు బోధించి వున్నారు.

జ్యోతిషరీత్యా పరిశీలిస్తే లక్ష్మీ దేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారంతో పై సంకేతాలు ఖచ్చితంగా సరిపోలుతున్నాయి అని జ్యోతిష్యకారులు చెబుతున్నారు.

జగన్మాత అయిన ఆ తల్లి కృప హఠాత్తుగానో, పుట్టుకతోనో మనపై కలుగవచ్చు. పూర్వజన్మలో మనం చేసిన సత్కర్మలో, ఇప్పటి సద్వర్తనమో, మనతల్లిదండ్రులు చేసిన పుణ్యమో దానికి కారణం కావచ్చు.

సంపదలను అనుగ్రహించే ఆ తల్లి ఆ సంపదలను సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తుంది.

ఆ డబ్బు చేరటంతో మదమెక్కి ప్రవర్తిస్తే రాక్షసులలాగానే ఎప్పుడొ ఏమరుపాటున ఆ తల్లిని తలపైకెక్కించుకుని కళ్ళుకూడా అక్కడేఉంటాయనే పెద్దలు కల్లునెత్తికెక్కాయిరా అని తిట్టేది కానిపనులు చేసి కష్టాలపాలు కాకూడదు. అమ్మదయతో చేరిన ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ధర్మ, కామ, మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా వినియోగించుకోవాలి…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here